Naga Chaitanya First Look Release From Bangarraju Movie: ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున-దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనేది ఉప శిర్షీక. ఈ సినిమాలో మరో అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అంతేగాక ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక్కొక్కటిగ అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో ఓ ఫస్ట్‌సాంగ్ విడుదల కాగా.. కృతి శెట్టి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి
వీటికి మంచి స్పందన వస్తోంది. ఇక రేపు నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా ‘బంగార్రాజు’ నుంచి చై లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందంగా. బంగార్రాజు ఫస్ట్‌లుక్ అవుట్ అంటూ ఈ సందర్భంగా చై పాత్రను వెల్లడించారు. ఇక రేపు(నవంబర్ 23) చై పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే నాగచైతన్య ‘బంగార్రాజు’ అయితే మరీ నాగార్జున పాత్ర ఏంటనేది ఆసక్తిగా మారింది.
చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్
Here is the First Look of
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 22, 2021
🔥బంగార్రాజు🔥@chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_ @lemonsprasad#Bangarraju #BangarrajuComing#HBDChay pic.twitter.com/iYDDy1qzUp
Comments
Please login to add a commentAdd a comment