ఉప్పెన వచ్చేది అప్పుడే! | Panja Vaisshnav Tej is Uppena first look, release date out | Sakshi
Sakshi News home page

ఉప్పెన వచ్చేది అప్పుడే!

Jan 24 2020 3:21 AM | Updated on Jan 24 2020 3:21 AM

Panja Vaisshnav Tej is Uppena first look, release date out - Sakshi

పంజా వైష్ణవ్‌ తేజ్‌

సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఉప్పెన’. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన బుచ్చిబాబు సాన ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్,  సుకుమార్‌ రైటింగ్స్‌  సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బుధవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి, ఏప్రిల్‌ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సాయిచంద్, బ్రహ్మాజీ  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యాందత్‌ సైనుద్దీన్, నిర్మాతలు: నవీన్‌ యర్నేని, వై. రవిశంకర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అనిల్‌ వై, సీఈవో: చెర్రీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: అశోక్‌ బండ్రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement