
కిరణ్ అబ్బవరం, కోడి దివ్య
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం పుట్టినరోజు (గురువారం) సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సెబాస్టియన్ పీసీ 524’, సమ్మతమే’ చిత్రాల నుంచి కొత్త లుక్స్ విడుదల చేశారు. అదే విధంగా మరో కొత్త సినిమాని ప్రకటించారు. కిరణ్ హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రమోద్, రాజు నిర్మించిన ‘సెబాస్టియన్ పీసీ 524’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సిద్ధారెడ్డి .బి. కాగా కిరణ్, చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కనకాల ప్రవీణ నిర్మిస్తున్న ‘సమ్మతమే’ షూటింగ్ 80 శాతం పూర్తయింది.
నిర్మాతగా కోడి దివ్య: లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమాను ప్రకటించారు దివ్య. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.