
మంచు మనోజ్
మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై తన ఎనర్జీని చూపించడానికి రెడీ అయ్యారు మంచు మనోజ్. కమ్‌బ్యాక్ సినిమాగా ‘అహం బ్రహ్మస్మి’ అనే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారాయన. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మంచు మనోజ్, నిర్మలా దేవి నిర్మిస్తున్నారు. ప్రియా భవానీశంకర్ కథానాయికగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఫస్ట్ లుక్ అందరి దృష్టినీ ఆకర్షించేలా ఉంది. సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. రేపు ఈ సినిమా ముహూర్తం జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment