సీటీమార్‌ ఖరార్‌ | Gopichand is Seetimaarr first look release | Sakshi
Sakshi News home page

సీటీమార్‌ ఖరార్‌

Published Tue, Jan 28 2020 6:04 AM | Last Updated on Tue, Jan 28 2020 6:04 AM

Gopichand is Seetimaarr first look release - Sakshi

గోపీచంద్‌

గోపీచంద్‌ విజిల్‌ వేస్తున్నారు. సీటీ మార్‌ సీటీ మార్‌ అంటూ సందడి చేస్తున్నారు. ఫుల్‌ ఎనర్జీతో ప్రేక్షకుల్లో హుషారు నింపనున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించనంత ఎనర్జిటిక్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సినిమా టైటిల్‌ ‘సీటీ మార్‌’. ‘యు టర్న్‌’లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ అధినేత శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్‌ నంది దర్శకుడు. గోపీచంద్‌ సరసన తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘సీటీమార్‌’ టైటిల్‌ని ఖరారు చేసిన విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్, రాజమండ్రిలోæభారీ షెడ్యూల్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రారంభించిన షెడ్యూల్‌ను నాన్‌స్టాప్‌గా జరుపుతాం. సమ్మర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement