తమిళసినిమా: దక్షిణాది సినిమాల్లో నటి నిత్యామీనన్‌కు నేమ్, ఫేమ్ ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నిత్యామీనన్ ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగే ఏది పడితే ఆ పాత్ర ఒప్పుకోదు. అదే ఆమెలో ప్లస్, మైనస్ కూడా. నటనకు అవకాశం ఉన్న పాత్రలే అంగీకరించి పేరు తెచ్చుకుంటోంది. అలాగే కొన్ని మంచి ప్రాతలను కూడా నిరాకరించడం వల్ల అవకాశాలను కోల్పోతోంది.
అందుకే అన్ని భాషల్లో కలిపి 6 నెలలకో, ఏడాదికో ఈమె నటించిన చిత్రాలు విడుదల అవుతుంటాయి. అంతెందుకు ఇటీవల ఈ భామ ధనుష్‌కు జంటగా తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటింంది. ఇందులో నటి రాశీఖన్నా, ప్రియాభవాని శంకర్ ఉన్నా, ఇలా మెరిసి అలా వెళ్లిపోతారు. ఇంకా చెప్పాలంటే ఆ చిత్ర కథకు నిత్యామీనన్ పాత్రే ప్రధాన బలం, చిత్రం విడుదలైన తరువాత ఆమెకు అంత మంచి పేరు వచ్చింది కూడా. దీంతో అవకాశాలు నిత్యామీనన్ తలుపులను తడుముతున్నాయి.
అయితే ఆమె దర్శక నిర్మాతలకు కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదనే టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అసలు కారణం ఏమిటని ఆరా తీస్తే నిత్యామీనన్ తన కాల్‌షీట్స్ అన్ని ఒక ప్రముఖ బాలీవుడ్ సంస్థ చేతిలో పెట్టిందని తెలిసింది. నిత్యామీనన్ కాల్‌షీట్స్ కోసం ఆ సంస్థను కలవడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. దీంతో నిత్యామీనన్ అసలు ఎందుకిలా చేసింది అనే ప్రశ్న తలెత్తుతోంది. నిత్య ఎందుకిలా చేసింది?
Comments
Please login to add a commentAdd a comment