నిత్య ఏ సినిమా చేసినా తనే హీరో! : నాని | 100 days of love telugu audio launch | Sakshi
Sakshi News home page

నిత్య ఏ సినిమా చేసినా తనే హీరో! : నాని

Published Fri, Jul 15 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

నిత్య ఏ సినిమా చేసినా తనే హీరో! : నాని

నిత్య ఏ సినిమా చేసినా తనే హీరో! : నాని

‘‘వెంకట్‌ను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది.
ప్రొడక్షన్ మేనేజర్  నుంచి డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. ‘100 డేస్ ఆఫ్ లవ్’ చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఆయనకు ఈ చిత్రం విజయం అందించాలి. నిత్యామీనన్ నాతో, నానితో రెండేసి చిత్రాలు చేసింది. మా ముగ్గురి కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలనుంది. అది కూడా మా ముగ్గురికి మేనేజర్‌గా పనిచేసిన వెంకటే నిర్మిస్తే బాగుంటుంది’’ అని హీరో నితిన్ అన్నారు.
 
  దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా జీనస్ మొహ్మద్ దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కిన ‘100 డేస్ ఆఫ్ లవ్’ చిత్రాన్ని ఎస్‌ఎస్‌సీ మూవీస్ సమర్పణలో ఎస్. వెంకటరత్నం అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం పాటల సీడీని నితిన్ విడుదల చేసి నానీకి అందించారు. నాని మాట్లాడుతూ- ‘‘అలా మొదలైంది’ చిత్రంతో నిత్య తెలుగులో ప్రయాణం మొదలుపెట్టింది.
 
 నిత్య ఇప్పుడు ఏ స్టేజ్‌కి వెళ్లిపోయిందంటే హీరోయిన్‌గా చేసినా ఆ సినిమాకి తనే హీరో. నితిన్ అన్నట్లు మనం (నిత్యాని ఉద్దేశించి) మల్టీస్టారర్ మూవీ చేద్దాం’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త చిత్రం చూశామనే అనుభూతి కలుగుతుంది. ఇంచుమించు హాలీవుడ్ లెవల్‌లో ఈ సినిమా ఉంటుంది’’ అని నిత్యామీనన్ చెప్పారు. ఈ వేడుకలో చిత్ర దర్శక- నిర్మాతలు ఎస్. వెంకటరత్నం, జీనస్ మొహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement