Actress Nithya Menen Wedding Rumors Goes Viral - Sakshi
Sakshi News home page

Nitya Menen Wedding Rumors: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్‌? వరుడు ఎవరంటే..

Published Tue, Jul 19 2022 12:49 PM | Last Updated on Tue, Jul 19 2022 1:28 PM

Nithya Menen Wedding Rumors Goes Viral With a Malayalam Actor - Sakshi

'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్‌. ఇక్కడ ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఏ భాషలో నటించిన తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటుందామె. అంతేకాదు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తన మల్టీ టాలెంట్‌తో పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ. బాల నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నిత్యాపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్లు వినిపించలేదు.

చదవండి: Actress Kalayani Divorce: ఆ భయంతోనే కల్యాణి విడాకులు అడిగింది..: సూర్య కిరణ్‌

హీరోయిన్‌ అంటే ఆ హీరోతో డేటింగ్‌ అని, ఈ నటుడితో సహాజీవనం వంటి వార్తలు వినిపించడం సర్వాసాధారణం. కానీ తనపై ఒక్క పుకారు కూడా రాకుండా ఇండస్ట్రీలో రాణించడమంటే అది కొద్ది మందికే సాధ్యమవుతుంది. అందులో నిత్యా ఒకరని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా నిత్యా పెళ్లికి సంబంధించి రకరకాల పుకార్లు ప్రస్తుతం నెట్టిం చక్కర్లు కొడుతున్నాయి. మూడు పదుల వయసులో ఉన్న నిత్యా మీనన్‌ ప్రస్తుతం పెళ్లి రెడీ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోబోయేది చిత్ర పరిశ్రమలోని వ్యక్తే నని, అతడు ఓ స్టార్‌ యాక్టర్‌ అని వినికిడి.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..

సదరు హీరోకు, నిత్యాకు కొంతకాలంగా మంచి సాన్నిహిత్యం ఉందని, త్వరలోనే అతడితో ఏడడుగులు వేయబోతుందంటూ మలయాళ వెబ్‌సైట్లలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. కాగా ఇటీవల భీమ్లానాయక్‌ చిత్రంతో అలరించిన నిత్యా మీనన్‌ రీసెంట్‌గా ‘మోడ్రన్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అమెజాన్‌ ప్రైం వీడియోస్‌లో జూలై 8న విడుదలై ఈ సిరీస్‌ పాజిటివ్‌ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది నిత్యా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement