
హత్తుకునేలా పాటపాడిన హీరోయిన్!
నిత్యా మెనన్.. అందం, అభినయంతోపాటు మృదువైన గాత్రం కూడా ఆమె సొంతం..
నిత్యా మెనన్.. అందం, అభినయంతోపాటు మృదువైన గాత్రం కూడా ఆమె సొంతం.. తొలి సినిమా 'అలా మొదలైంది'లోనే ఓ పాట పాడి.. సింగర్‌గా కూడా తనను తాను నిరూపించుకుంది ఈ కేరళ కుట్టి. తాజాగా సూర్య హీరోగా వస్తున్న 'సైంటిఫిక్' మూవీ '24'లో కీలక పాత్ర పోషిస్తున్న నిత్య తాజాగా మరోసారి గొంతు సవరించుకుంది.
'లాలిజో.. లాలిజో..' అంటూ లలితమైన లాలి పాటను మధురంగా పాడింది నిత్య. '24' సినిమాలో సూర్యకు భార్యగా నిత్య నటిస్తోంది. బిడ్డను నిద్రపుచ్చుతూ.. అమ్మపాడే లాలిపాటను గుండెకు హత్తుకొనేలా ఏఆర్ రహమాన్ సంగీత సారథ్యంలో ఆలపించింది నిత్య. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ పాట రికార్డింగ్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో 22కు పైగా పాటలు పాడిన నిత్య తన గాత్రంలో ఎంత మాధుర్యముందో ఈ పాటతో నిరూపించింది.