నాకేం బరువుగా లేదే! | Nithya Menon Focuses On Her Weight | Sakshi
Sakshi News home page

నాకేం బరువుగా లేదే!

Published Sun, Sep 30 2018 3:55 AM | Last Updated on Sun, Sep 30 2018 3:55 AM

Nithya Menon Focuses On Her Weight - Sakshi

నిత్యా మీనన్‌

హీరోయిన్‌ అంటే సైజ్‌ జీరో అయ్యుండాలి. సన్నజాజి కొమ్మలా ఉండాలి అని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ ఆ అభిప్రాయంతో నేనసలు ఏకీభవించను అంటున్నారు నిత్యా మీనన్‌. ఈ మధ్య బరువు బాగా పెరిగారు అని ఎవరో ఆమెను అడిగారు. అంతే... నాకేం అంత బరువుగా అనిపించడం లేదే అని చురుక అంటించారు. ఈ విషయమై నిత్యా మీనన్‌ మాట్లాడుతూ – ‘‘నా బరువు గురించి నేను మాట్లాడినా మాట్లాడకపోయినా సోషల్‌ మీడియాలో మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. నా బరువు గురించి నేనసలు కేర్‌ చేయను.

నాకు ఏ ఇబ్బందీ లేనప్పుడు మీకెందుకు బరువుగా అనిపిస్తోంది? తగ్గాలంటే కొన్ని నెలల పని. పెద్ద విషయం కాదు. పాత తరం హీరోయిన్లు అందరూ బొద్దుగానే ఉండేవారు. అలాగని దర్శక–నిర్మాతలు వాళ్లతో సినిమాలు తీయడం మానేశారా? వాళ్లకంత పాపులారిటీ వచ్చిందంటే అది కేవలం వాళ్ల యాక్టింగ్‌ స్కిల్‌ వల్ల కానీ సైజ్‌ జీరో వల్ల కాదు. ఒకవేళ ఏదైనా చిత్రంలో సైజ్‌ జీరో పాత్రలో నన్ను చూపించాలనుకుంటే నా దగ్గ రకు రాకండి (దర్శక–నిర్మాతలను ఉద్దేశించి)’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement