
‘నిత్యా మీనన్ సినిమాల్లో విభిన్నత ఉంటుంది. విభిన్నమైన సినిమాల్లో నిత్యా మీనన్ ఉంటుంది’ అనేలాంటి ఇమేజ్ ఏర్పరచుకున్నారు నిత్యా మీనన్. ఇప్పుడు తాజాగా మరో విభిన్నమైన సినిమా చేశాను అంటున్నారామె. నిత్యా మీనన్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో మలయాళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘19 1a’. ఇందువీయస్ ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. మలయాళంలో విజయ్ సేతుపతి నటిస్తున్న రెండవ చిత్రమిది.
నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇటీవలే ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా గురించి నిత్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథాంశం రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల గుర్తు చేస్తుంది. ఈ కథలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథను మీ అందరికీ త్వరగా చూపించాలనుంది’ అన్నారు. ఇది కాకుండా తెలుగులో ‘నిన్నిలా నిన్నిలా’ అనే సినిమా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment