
నిత్యామీనన్, అలివర్, నిత్య
ఒక్క ఫొటో ఎన్నో అర్థాలు చెబుతుంది. చూసే కళ్లను బట్టి అర్థాలు మారిపోతుంటాయి. ఇటీవల నిత్యా మీనన్ బయటపెట్టిన ఒక ఫొటో చాలామందికి ఒకే అర్థం చెప్పింది. ‘అయ్యో.. నా గుండె పగిలిపోయింది, అతనంటే చాలా అసూయగా ఉంది, ఈ ఫొటో చూసి తట్టుకోలేకపోతున్నాను’ అంటూ నిత్యా అభిమానులు తెగ బాధపడిపోయారు. ఓ కుర్రాణ్ణి నిత్యా హత్తుకున్న ఫొటో చూసి, అభిమానులు ఈ విధంగా స్పందించారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే. ఇంతకీ ఫొటోలో ఉన్న అబ్బాయి ఎవరు? నిత్యాకీ, అతనికీ లింక్ ఏంటీ? అంటే.. ఈ ఇద్దరి పరిచయం ఇప్పటి కాదట. ధ్యానం నేర్పించే ‘ఓ అండ్ ఓ అకాడమీ’, ‘వన్ నెస్ యూనివర్శిటీ’ స్కూల్స్‌లో ఇతగాడితో నిత్యాకు పరిచయం అయిందట.
హాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ కుర్రాడి పేరు ఆలివర్ కాల్హాన్. అప్పుడప్పుడూ ఇద్దరూ కలుసుకుంటుంటారు. ఇటీవల కలిసినప్పుడు ఇలా ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను ‘ఫ్రెండ్‌షిప్, లవ్ అండ్ హ్యాపీనెస్’ అంటూ నిత్యామీనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫొటో చూసి చాలామంది తికమకపడ్డారు. నిత్యా, ఆలివర్ లవ్‌లో ఉన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ‘‘మీరనుకుంటున్నట్లు ఏమీ లేదు. తను నాకు మంచి స్నేహితుడు. చెప్పాలంటే చిన్న తమ్ముడిలాంటివాడు’’ అని నిత్యా పేర్కొనడంతో.. ‘హమ్మయ్య.. కమిట్ అయిపోయారనుకున్నాం. క్లారిఫికేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని కొందరు ఫాలోయర్లు సంబరపడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment