అవకాశాల కోసం అలా చేయను | NTR Janatha Garage Movie Release Date On September 1st | Sakshi
Sakshi News home page

అవకాశాల కోసం అలా చేయను

Published Tue, Aug 30 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

అవకాశాల కోసం అలా చేయను

అవకాశాల కోసం అలా చేయను

చెన్నై:  ఇతరుల కంటే వైరుధ్య భావాలు గల నటి నిత్యామీనన్ అని చెప్పవచ్చు. నటనే వృత్తిగా ఎంచుకున్న ఆమె అదే జీవితం కాదు అంటారు. అందుకే నిత్యను కొందరు పొగరుబోతు అంటారు. అయినా డోంట్ కేర్ అంటున్నారు ఈ కేరళాకుట్టి. మణిరత్నం చిత్రం ‘ఓ కాదల్ కణ్మణి’ చిత్రం వరకూ కోలీవుడ్‌లో అంతగా పేరులేని నాయకి నిత్యామీనన్. ఆ చిత్ర విజయం మంచి ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాదు అంతకు ముందు వరకూ చిన్న హీరోల సరసన నటించిన ఈ బ్యూటీకి ఆ తరువాత ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరుస కడుతుండడం గమనార్హం.
 
పాత్ర నచ్చితే అది చిన్నదైనా నటించడానికి సిద్ధం అంటున్న నిత్యామీనన్ 24 చిత్రంలో సూర్య సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సుదీప్ సరసన ముడింజా ఇవన పుడి చిత్రంలో నటించిన నిత్యామీనన్ తాజాగా విక్రమ్‌కు జంటగా ఇరుమురుగన్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ అంటూ ప్రముఖ నాయకులతో నటించడం విశేషం. నిత్యామీనన్ సాధారణ పొడుగు  కాస్త తక్కువే. దాన్ని కొరతగా చూపేవాళ్లూ లేక పోలేదు.
 
అయితే దాన్ని ఒక అనర్హతగా తానెప్పుడూ భావించలేదంటారామె. ఇంతకు ముందు పొట్టి, లావు అని వంకలు పెట్టిన వారే ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకోవడంతో నిత్యామీనన్ మంచి నటి అని అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారని పేర్కొంది. మరికొందరు బరువు తగ్గి స్లిమ్ అయితే మరిన్ని అవకాశాలను రాబట్టుకోవచ్చునన్న ఉచిత సలహాలిస్తున్నారని, అవకాశాల కోసం నోరు కట్టుకోవలసిన అవసరం తనకు లేదని అన్నారు.
 
ఇష్టమైన ఆహార పదార్థాలు తింటేనే నాకు సంతోషంగా ఉంటుందన్నారు. అప్పుడే ముఖం కాంతులీనుతుందని అన్నారు. ఆ అందం కంటే ఆహారంలో ఆంక్షలు విధించుకుని స్లిమ్ అయ్యి అరువు అందాలను కొనితెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని నిత్యామీనన్ అంటున్నారు. తానింతే బొద్దుగా ముద్దుగా ఉంటానంటున్న ఈ భామ సమంతతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ సెప్టెంబర్ ఒకటో తారీఖున తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement