
నిత్యామీనన్
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నది నానుడి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు బొద్దుగా ఉన్నా సరే.. జీరో సైజ్ అంటూ చిక్కినా సరే.. ప్రేక్షకులు మాత్రం అభిమానించకుండా ఉండలేరు. కెరీర్ తొలినాళ్లలో సన్నగా ఉన్న మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ఆ తర్వాత బొద్దుగా తయారయ్యారు. ‘మనం బొద్దుగా ఉన్నామా? సన్నగా ఉన్నామా? అన్నది ముఖ్యం కాదు. నటన ముఖ్యం. మన పాత్రలకి న్యాయం చేస్తున్నామా? లేదా? అన్నదే చూడాలి’ అంటూ నిత్యామీనన్ ఆ మద్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
ఈ మలయాళ బ్యూటీకి తెలుగులో ఆఫర్లేవీ లేకున్నా తమిళ్, హిందీ చిత్రాలతో బిజీగానే ఉన్నారు. తాజాగా ఓ కొత్త సినిమా అంగీకరించినట్లు ఉన్నారు. ‘హైవే పై షూట్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు త్వరలో చెబుతాను’ అంటూ నిత్యామీనన్ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసి బొద్దుగా ఉన్న నిత్య సన్నబడి మునుపటిలా నాజూకుగా ఉన్నారంటున్నారు ఆమె అభిమానులు.