
నిత్యా మీనన్
ఒక్కే ఒక్క పాత్రతో ఒకేసారి నాలుగు భాషలలో తెరకెక్కించారు. పైగా ఫస్ట్ టైమ్ సరౌండ్ సింక్ సౌండ్‌తో చిత్రీకరణ. సినిమా పేరు ‘ప్రాణ :’. ఇన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్న డిఫరెంట్ సినిమాలో నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు. వీకే ప్రకాశ్ దర్శకత్వంలో, పీసీ శ్రీరామ్ కెమెరామేన్‌గా రూపొందిన చిత్రం ‘ప్రాణ:’. సురేశ్ రాజ్, ప్రవీణ్ ఎస్. కుమార్, అనితా రాజ్‌లు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరో నాని రిలీజ్ చేశారు.
‘‘నిత్యామీనన్‌కు, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. నేను కూడా ఈ సినిమాలో భాగమే కానీ చిన్న భాగం’’ అన్నారు నాని. నిత్యా మీనన్ మాట్లాడుతూ – ‘‘మీ సపోర్ట్‌కి, మీ ప్రెజెన్స్‌కి చాలా థ్యాంక్స్ నాని. మీ ఇన్వాల్వ్‌మెంట్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. అందరికీ ఈ సినిమా ఎప్పుడు చూపిస్తానా అని ఆత్రుతగా ఉంది’’ అని పేర్కొన్నారు. మరి నాని ఇన్‌వాల్వ్‌మెంట్ అంటే ఏదైనా సీన్‌లో గెస్ట్‌గా కనిపిస్తారా? లేకపోతే వినిపిస్తారా? అంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment