కున్నూర్‌లో హాయ్‌ నాన్న | Nani resumes shooting for the family drama at Coonoor | Sakshi
Sakshi News home page

కున్నూర్‌లో హాయ్‌ నాన్న

Published Sun, Sep 3 2023 4:36 AM | Last Updated on Sun, Sep 3 2023 4:36 AM

Nani resumes shooting for the family drama at Coonoor - Sakshi

కున్నూర్‌కు మకాం మార్చారు నాని. శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ, నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతీహాసన్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాని కూతురి పాత్రను కియారా ఖన్నా చేస్తోంది.

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ కున్నూర్‌లో ప్రారంభమైంది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని హీరో నాని వెల్లడించారు. నానీతో పాటు ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శౌర్యువ్‌. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement