
24 ముందు కథేంటి!
సూర్య తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 24. సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్‌కుమార్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ టైమ్ మిషన్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా ఈ నెల 6వతేదీన విడుదల చేశారు. చిత్రానికి ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణ అభిస్తోంది. ఈ చిత్రంలో పోషించిన మూడు పాత్రల్లో రెండు పాత్రల్ని కవల పిల్లలుగా చూపించారు.
అవే ఆత్రేయ,సేతురామన్ పాత్రలు.అయితే ఆ పాత్ర ల భావస్వారూప్యాలను యుక్త వయసు దాటిన తరువాతే చూపించారు. దీంతో అంతకు ముందు కథేమిటన్న ఆసక్తి చిత్రం చూసిన వారికి కలుగుతుంది. ఆ క థను తరువాత తెరకెక్కిస్తానంటున్నారు దర్శకుడు. సాధారణంగా చిత్రం విజయం సాధిస్తే దానికి సీక్వెల్స్ తీస్తుంటారు. అలాంటిది దర్శకుడు విక్రమ్‌కుమర్ 24 చిత్రానికి ముందు కథను తరువాత తెరకెక్కిస్తానంటున్నారు. కవల పిల్లలు ఆత్రేయ, సేతురామన్ ఇతివృత్తంతో సూర్య హీరోగానే చిత్రం చేస్తానని ఆయన ఇటీవల తెలిపారు.
అయితే ప్రస్తుతం ఆయన అల్లుఅర్జున్, మహేశ్‌బాబులతో చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తరువాత సూర్యతో 24 చిత్రానికి ముందు కథతో చిత్రం చేస్తారట. సాదాసీదా కథలే అయినా ఆసక్తికరమైన కథనాలతో చిత్రాలను జనరంజితంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన విక్రమ్‌కుమార్ 24 చిత్రానికి టైమ్ మిషన్ ఫార్ములాను ఉపయోగించుకుని సక్సెస్ అయ్యారు. ఈ సారి ఎలాంటి మ్మాజిక్‌ను వాడనున్నారో మరి. అది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.