'యంగ్ టైగర్కు జోడీగా నిత్య, సమంత' | Samantha, Nithya team up with NTR in 'Janatha Garage' | Sakshi
Sakshi News home page

'యంగ్ టైగర్కు జోడీగా నిత్య, సమంత'

Published Tue, Feb 16 2016 7:27 PM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

'యంగ్ టైగర్కు జోడీగా నిత్య, సమంత' - Sakshi

'యంగ్ టైగర్కు జోడీగా నిత్య, సమంత'

చెన్నై: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సమంత, నిత్యమీనన్‌తో ఆడిపాడనున్నారు. మిర్చి, శ్రీమంతుడులాంటి హిట్ చిత్రాలు తీసిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, సమంత, నిత్యమీనన్ లు నటించనున్నారు . ఈ సినిమా వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సినిమాకోసం తొలుత పలువురు పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు సమంత, నిత్యమీనన్‌ల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఎన్‌టీఆర్‌కు అంకుల్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక దేవయాని, ఉన్ని ముకుందన్లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రధాన పాత్రల చుట్టే కథ తిరిగే ఈ చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement