యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిదిపోయే గుడ్ న్యూస్. తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్‌తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన ఈ పోస్టర్‌లో జూనియర్ సముద్రంలో నిలబడి ఆయుధాలు పట్టుకుని కనిపించగా అది నెట్టింట్లో వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
(చదవండి: సమంత ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్)
ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 12న పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment