
నిత్యామీనన్
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ హిందీ సినిమా చేయలేదు నిత్యామీనన్. అయితే.. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారామె. నిత్యామీనన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ప్రాణ’. ఏకకాలంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం ఒకే ఒక్క పాత్రతో వీకే ప్రకాశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సామాజిక సమస్యలపై పోరాడే రచయిత్రిగా నిత్య కనిపించనున్నారు. ఈ విషయం గురించి నిత్యా మాట్లాడుతూ– ‘‘ప్రాణ’ చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవ్వబోతోంది. హిందీలో ఇదే నా ఫస్ట్ సినిమా అవ్వనుంది’’ అన్నారు. ఈ ఏడాది చివర్లో ‘ప్రాణ’ చిత్రం రిలీజ్ కానుంది.