
మరోసారి జతగా...
‘ఓకే బంగారం’తో హిట్ పెయిర్ అనిపించుకున్న నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ మలయాళంలో నటించిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వంలో తెరకెక్కగా, మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ‘జతగా’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి అనువదించారు. మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత సురేశ్ మాట్లాడుతూ - ‘‘మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన చిత్రమిది.
లవ్, సెంటిమెంట్‌తో పాటు పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం తెలిపే అంశాలతో నిర్మించిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. సాహితి రాసిన మాటలు, గోపీ సుందర్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణ. లోకనాథన్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది. అతి త్వరలో పాటలు విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.