మణిరత్నం సినిమాకు నాని డబ్బింగ్ | Nani to Dub for Dulquar Salman in Mani Ratnam's film | Sakshi
Sakshi News home page

మణిరత్నం సినిమాకు నాని డబ్బింగ్

Published Sat, Mar 7 2015 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

మణిరత్నం సినిమాకు నాని డబ్బింగ్

మణిరత్నం సినిమాకు నాని డబ్బింగ్

 మణిరత్నం మీద అభిమానంతో నాని అనువాద కళాకారుడిగా మారిపోయారు. మలయాళ హీరో మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రకు మాట సాయం చేశారు. విషయం ఏంటంటే.. దుల్కర్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఓకె కన్మణి’ని ‘ఓకె బంగారం’ పేరుతో ‘దిల్’ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.
 
  ఇందులో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెప్పారు. ఆ విధంగా ఈ సినిమా మొత్తం చూసిన నాని, ‘సఖి’ కన్నా గొప్ప విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంటుందని చెప్పారు. అప్పట్లో మణిరత్నం ‘సఖి’ని నైజామ్‌లో పంపిణీ చేశాననీ, ఇప్పుడీ ‘ఓకె బంగారం’ చిత్రాన్ని అనువదించి, విడుదల చేయడం ఆనందంగా ఉందని ‘దిల్’ రాజు అన్నారు. ఎ.ఆర్. రహమాన్ స్వరపరచిన పాటలను ఈ నెలాఖరునా, చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయనున్నామనీ ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి. శ్రీరామ్, పాటలు: సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement