
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా నటిస్తున్న డైసీ ఎడ్గర్ జోన్స్ కుటుంబ కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో మరో హీరోయిన్‌ను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.
అదే సమయంలో సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్‌కు రాజమౌళి నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్‌లో నిత్యకు లుక్ టెస్ట్ నిర్వహించనున్నారట. మరి నిత్య నటించబోయేది ఎన్టీఆర్ జోడిగానేనా లేక మరో పాత్రా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ గాయం కారణంగా ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment