
వంద రోజుల ప్రేమ!
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘100 డేస్ ఆఫ్ లవ్’ అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. జీనస్ మహ్మద్ దర్శకుడు. ఎస్.ఎస్.సి. మూవీస్ సమర్పణలో నిర్మాత ఎస్.వెంకటరత్నం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గోవింద్ మీనన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత ఎస్.వెంకటరత్నం మాట్లాడుతూ - ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. ‘ఓకే బంగారం’లో దుల్కర్, నిత్యాల నటన, కెమిస్ట్రీలకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారు. నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు.