కాస్ట్యూమ్‌ పడితే చాలు | nithya menen saying I am a spontaneous actor not a method actor | Sakshi
Sakshi News home page

కాస్ట్యూమ్‌ పడితే చాలు

Published Thu, Aug 1 2019 1:13 AM | Last Updated on Thu, Aug 1 2019 1:13 AM

nithya menen saying I am a spontaneous actor not a method actor - Sakshi

‘‘నేను మెథడ్‌ యాక్టర్‌ని కాదు. స్పాంటేనియస్‌ యాక్టర్‌ని. నిజం చెప్పాలంటే పాత్ర కోసం పెద్దగా ప్రిపేర్‌ అవ్వను’’ అన్నారు నిత్యా మీనన్‌. ఏదైనా పాత్రను చేయడానికి ఎలా ప్రిపేర్‌ అవుతారు అనే ప్రశ్నకు నిత్యామీనన్‌ స్పందిస్తూ – ‘‘కేస్‌ స్టడీ చేసేవి, బయోపిక్‌ అయితే తప్ప మిగతా పాత్రలకు అంత కష్టపడాల్సిన పని లేదు. ఒక్కసారి కాస్ట్యూమ్‌ నా ఒంటిమీద పడితే పాత్రలోకి వెళ్లిపోతాను. ‘మనం నిత్యామీనన్‌’ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తాను.

ఆ పాత్ర మూడ్‌లోకి మారిపోతాను. మన ఇండస్ట్రీలో చాలాసార్లు స్క్రిప్ట్‌ను చివరి నిమిషంలో ఇస్తుంటారు. కొన్నిసార్లు షూటింగ్‌ జరిగే రోజు ఉదయమే స్క్రిప్ట్‌ ఇచ్చేవాళ్లు. కథ తొలిసారి వింటున్నప్పుడే పాత్ర నాకు గుర్తుండిపోతుంది. ఆ పాత్రకు నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోతాను. స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు ఆ డైలాగ్‌ ఉందని చెప్పారు. షూట్‌ చేయడం లేదేంటి? అని దర్శకుడిని అడుగుతుంటాను కూడా. వాళ్లు చాలాసార్లు షాక్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement