టాలీవుడ్ హీరోయిన్ బర్త్‌ డే.. ఫస్ట్‌ లుక్ అదిరిపోయింది! | Tollywood Actress Nithya Menen Latest Movie Update Goes Viral | Sakshi
Sakshi News home page

Nithya Menen: నిత్యామీనన్‌ బర్త్‌ డే.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూశారా?

Published Mon, Apr 8 2024 9:11 PM | Last Updated on Mon, Apr 8 2024 9:19 PM

Tollywood Actress Nithya Menen Latest Movie Update Goes Viral - Sakshi

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే,  జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల వెబ్‌ సిరీస్‌లతో అలరించిన మలయాళీ భామ 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 

ఇవాళ నిత్యా మీనన్ బర్త్‌ డే కావడంతో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా నిత్యా నటిస్తోన్న 'డియర్ ఎక్సెస్‌' మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా కామిని డైరెక్టర్‌గా పరిచయవుతున్నారు. రిలీజైన పోస్టర్‌లో నిత్యా ఒక చేతిలో మొబైల్.. మరో చేతిలో గ్లాస్ పట్టుకుని కనిపించింది. ఈ సినిమాను బాస్క్ టైమ్ థియేటర్, పోప్టర్ మీడియా నెట్‌వర్క్ బ్యాన‌ర్‌ల‌పై బీజీఎన్, ఆదిత్య అజయ్ సింగ్, రామ్కి సంయ‌ుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్టర్‌ చూస్తే ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో  విన‌య్ రాయ్, న‌వ‌దీప్, ప్ర‌తీక్ బబ్బ‌ర్, దీప‌క్ ప‌రంబోల్  కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement