
నటి నిత్యామీనన్ మరోసారి వార్తల్లో నానుతోంది. సంచలనాలకు మారుపేరు ఈ మలయాళీ బ్యూటీ. ఎవరేమనుకున్నా తనకెంటీ అనే మనస్తత్వం కలిగిన నిత్యామీనన్ తనకు నచ్చింది చేసేస్తుంది ఈ అమ్మడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల బాగా బరువు పెరిగిందంటూ అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నా తన శరీరం తన ఇష్టం. తాను ఎలా ఉంటే నీకు ఎందుకు అని గడసరిగా సమాధానం ఇస్తోంది. ఇటీవల సైకో చిత్రంలో నటించిన నిత్య ఆ తర్వాత తమిళంలో ఒక చిత్రం కూడా కమిట్ కాలేదు. ( కొడుకు కోసమేనా.. )
ఆ మధ్య దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ది ఐరన్ లేడీ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఆ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు అన్నది గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యామీనన్ బ్రీత్ ఇన్ టు ద షాడోస్ అనే హిందీ చిత్రంలో పట్టించింది. ఆ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై హల్‌చల్ చేస్తోంది. విశేషమేంటంటే ఇందులో నటి నిత్యామీనన్ లెస్బియన్‌గా నటించింది. మరో యువతితో ఈమె నటించిన లిప్ లాక్ సన్నివేశాలు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి నిత్య ఎలా అంగీకరించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే కుర్రకారు మాత్రం ఆ దృశ్యాలను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నిత్యకు కొత్తేమి కాదు. ఇంతకుముందు కూడా ఆ అనే చిత్రంలో లెస్బియన్‌గా నటించింది. కాగా బ్రీత్ ఇన్ టు ద షాడోస్ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూస్తూ కుర్రకారు ఎంజాయ్ చేస్తున్నారు. దక్షిణాదిలో ఇలాంటివి అరుదే గానీ బాలీవుడ్‌లో ఇలాంటివి సర్వసాధారణం. ఏదేమైనా నిత్యామీనన్ వివాదాస్పద పాత్రలో నటించడంతో చిత్రానికి మంచి ప్రచారం లభిస్తోంది. మొత్తం మీద అలా మరోసారి నటి నిత్యామీనన్ వార్తల్లో నానుతోంది. ( అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా : విజయ్ )
Comments
Please login to add a commentAdd a comment