ఇక యాక్టింగ్‌కి బ్రేక్‌.. అందుకే అంటున్న స్టార్‌ హీరోయిన్‌ | Nithya Menen Said She Take Break From Shooting And Acting For a While | Sakshi
Sakshi News home page

Nithya Menen: ఇక యాక్టింగ్‌కి బ్రేక్‌.. అందుకే అంటున్న స్టార్‌ హీరోయిన్‌

Published Tue, Jul 26 2022 6:55 PM | Last Updated on Tue, Jul 26 2022 7:42 PM

Nithya Menen Said She Take Break From Shooting And Acting For a While - Sakshi

'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్‌. ఇక్కడ ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంతకాలంగా ఆమె తమిళం, మలయాళం చిత్రాలతో బిజీ ఆయిపోయింది. దీంతో కొంతకాలం తెలుగులో కనిపించని నిత్యా ఇటీవల భీమ్లా నాయక్‌ చిత్రంతో పాటు ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’ అలరించింది. అంవతేకాదు ప్రముఖ సింగింగ్‌ షోకు జడ్జీగా వ్యవహిరించింది.

చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌.. నీళ్లు నమిలిన విజయ్‌

ఈ క్రమంలో ఆమె తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు తాజాగా షాకిచ్చింది ఆమె. ఇక తాను సినిమాలకు, నటనకు బ్రేక్‌ తీసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చంది. కాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌ ముచ్చటించిన నిత్యా ఈ సందర్భంగా తాను యాక్టింగ్‌ బ్రేక్‌ తీసుకుంటున్నాని తెలిపింది. అయితే ఇది తాత్కాలికం వరకే అని కూడా స్పష్టం చేసింది. ఏడాదిగా సినిమా, వెబ్‌ సిరీస్‌లు, షోలో క్షణం తీరిక లేకుండా ఉన్నానని, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. అయితే ఈ బ్రేక్‌ పెళ్లి కోసం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది.

చదవండి: నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్‌

అంతేకాదు ఈ సందర్భంగా తన పెళ్లి పుకార్లను కూడా ఖండించింది. కాగా ఇప్పటి వరకు దూరంగా ఉన్న నిత్యా.. ఇటీవల తన పెళ్లంటూ వార్తలు గుప్పమన్నాయి. ప్రముఖ మలయాళ స్టార్‌ యాక్టర్‌తో తన పెళ్లంటూ ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 24 గంటల్లోనే తన పెళ్లి పుకార్లకు చెక్‌ పెట్టింది ఆమె. ప్రస్తుతం తాను కెరీర్‌పైనే ఫోకస్‌ పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నిత్యా.. తను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంది. తన సినిమాలన్ని వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement