Nithya Menen Shares Pregnancy Kit Photo And Fans Confused - Sakshi
Sakshi News home page

Nithya Menen: తల్లి కాబోతున్న నిత్యామీనన్.. ఆ పోస్ట్‌తో గందరగోళానికి గురైన ఫ్యాన్స్‌..!

Published Fri, Oct 28 2022 4:04 PM | Last Updated on Fri, Oct 28 2022 5:58 PM

Nithya Menen Shares Pregnancy Kit photo And fans confused - Sakshi

దక్షిణాదిలో నటి నిత్యామీనన్‌ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఆమె‌ ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం తొణికిసలాడుతుంది. కేవలం నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఆమె ఒప్పకుంటుంది. అయితే ఆమె ఇటీవల పెద్దగా చిత్రాల్లో నటించడం లేదు. ఈ భామ ధనుష్‌కు జంటగా తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటించింది. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. తాజాగా నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ కిట్ ఫోటోను షేర్ చేయడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో నిత్యా మీనన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 

(చదవండి: అవకాశాలు ఇస్తామన్నా.. నిత్యామీనన్‌ ఎందుకిలా చేస్తుంది?)

నిత్యా మీనన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెగ‍్నెన్సీ కిట్ ఫోటోను పోస్ట్ చేస్తూ..'"అండ్ ది వండర్ బిగిన్స్" అంటూ శీర్షిక పెట్టింది. ఆ పోస్ట్‌కు మహిళ ఏమోజీని కూడా ట్యాగ్ చేసింది. కానీ ఆమె నటించబోయే తదుపరి చిత్రానికి వండర్ విమెన్ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు నటి గర్భం దాల్చిందని మొదట భావించారు. కానీ ఆమె తాజా చిత్రం ప్రమోషన్లలో భాగంగానే ఇలా చేసి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. 

నిత్యా మీనన్ నటించిన పాపులర్ వెబ్ సిరీస్ బ్రీత్: ఇన్‌టు ది షాడోస్‌. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో అభా పాత్రలో మళ్లీ నటించనుంది. ఆకట్టుకునే ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ సిరీస్ వచ్చేనెల నవంబర్ 9న ఓటీటీలో విడుదలవుతోంది. ఈ డ్రామాలో అభిషేక్ బచ్చన్, డా. అవినాష్ సబర్వాల్  కూడా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement