
ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటుగా డిజిటల్ షోలు కూడా పోటీ పడుతున్నాయి. యాక్టర్స్ కూడా ఫీచర్‌ని, డిజిటల్‌ని వేరు చేయడం లేదు. ఏది వీలుంటే అందులో నటించడానికి అస్సలు సంకోచించడం లేదు. తాజాగా నిత్యామీనన్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. అమేజాన్ రూపొందిస్తున్న ‘బ్రీత్’ సీజన్ 2లో లీడ్ రోల్‌లో కనిపించనున్నారామె. అభిషేక్ బచ్చన్ హీరోగా నటించనున్నారు.
ఈ విషయం గురించి నిత్య మాట్లాడుతూ– ‘‘బ్రీత్’ నా తొలి డిజిటల్ షో. ఇలాంటి థ్రిల్లింగ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌లకు ఇలాంటి సిరీస్‌లు చాలా ఫర్పెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎపిసోడ్ ఎపిసోడ్‌కి చాలా సమయం ఉంటుంది. ప్రతి పాత్రను లోతుగా ఆవిష్కరించవచ్చు. డిజిటల్ సిరీస్‌లో కంటెంట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు కూడా’’ అని పేర్కొన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment