పవన్‌తో జోడీ: సాయి పల్లవికి బదులు నిత్యా మీనన్?‌! | Nithya Menon In Pawan Kalyan Film | Sakshi
Sakshi News home page

పవన్‌ మలయాళ రీమేక్‌లో మలయాళ హీరోయిన్‌!

Published Thu, Mar 25 2021 11:01 AM | Last Updated on Thu, Mar 25 2021 11:26 AM

Nithya Menon In Pawan Kalyan Film - Sakshi

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మలయాళ చిత్రం రీమేక్‌ ‘అయ్యప్పనమ్ కోషియం’కు ఎట్టకేలకు హీరోయిన్‌ కుదిరింది. ఈ చిత్రానికి నిత్యామీనన్‌ను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మేకర్స్ మొదట సాయి పల్లవిని  అనుకున్నా తన డేట్స్‌ కుదరక పోవడంతో సెట్‌ కాలేదు.  తరువాత వారు నిత్యా మీనన్‌ను అడగ్గా , ఆమె ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిత్యా సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ  తన డేట్స్‌ సర్దుబాటు , అగ్రిమెంట్‌​ మీద సంతకం లాంటి పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది, కనుక దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

అంతా అనుకున్నట్లు జరిగి ఈ  చిత్రంలో నిత్య నటిస్తే ఆమెకు టాలీవుడ్‌లో ఇది ఒక  పెద్ద కంబ్యాక్‌ చిత్రం అని చెప్పచ్చు. ఎందుకంటే తను తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి (2015) తరువాత పెద్ద చిత్రాలకు సంతకం చేయలేదు. ప్రస్తుతం  వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న అయ్యప్పనమ్‌ కోషియమ్‌ రీమేక్‌లో హీరో రానా నటిస్తుండగా, ఆమె సరసన కోలివుడ్‌ నటి  ఐశ్వర్య రాజేష్‌ను మరో  హీరోయిన్‌గా ఎంపిక  చేశారు. ( చదవండి : దర్శకుడిగా మారిన మోహన్‌ లాల్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement