Serial Actress Mansi Srivastava Marriage With Kapil Tejwani, Wedding Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Mansi Srivastava Wedding: గ్రాండ్‌గా నటి పెళ్లి, ఫొటోలు వైరల్‌

Published Sun, Jan 23 2022 1:06 PM | Last Updated on Sun, Jan 23 2022 6:35 PM

Actress Mansi Srivastava Tie Knot With Boyfriend Kapil Tejwani - Sakshi

బుల్లితెర నటి మాన్సి శ్రీవాత్సవ ప్రియుడు కపిల్‌ తేజ్వానీని పెళ్లాడింది. రెండేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న ప్రియుడితో ఆమె ఏడడుగులు నడిచింది. శనివారం (జనవరి 22న) జరిగిన వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కాగా కపిల్‌ వృత్తిరీత్యా ఓ ఫొటోగ్రాఫర్‌. ఓ కమర్షియల్‌ యాడ్‌ షూట్‌ చేస్తున్న సమయంలో మాన్సితో అతడికి పరిచయం ఏర్పడింది. 2019లో మరోసారి కలుసుకున్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Mansi Srivastava Marriage

అప్పటినుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకుని జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు రంగు లెహంగాలో మాన్సి ధగధగ మెరిసిపోతుందని, ఆమె ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Mansi Srivastava And Kapil Tejwani Wedding Photos

 కాగా మాన్సి.. అర్జున్‌, రబ్‌సే సోనా ఇష్క్‌, యే హై ఆషికి, ఇష్క్‌బాజ్‌, లాల్‌ ఇష్క్‌, దివ్య దృష్టి, విద్య, ఇష్క్‌ మై మర్‌జావా 2, కుండలీ భాగ్య వంటి పలు సీరియల్స్‌లో నటించి విశేషమైన పాపులారిటీ సంపాదించుకుంది. 2016లో మోహిత్‌ అబ్రల్‌ను ప్రేమించిన ఆమె అతడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. కానీ అంతలోనే ఇద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో వీరు ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement