Sanam Saeed: ప్రైడ్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌.. ఫ్యాన్‌ ఆఫ్‌ ఇండియా! | Life Story Of Popular Actress And Singer Sanam Saeed Funday Sakshi Story | Sakshi
Sakshi News home page

Sanam Saeed: ప్రైడ్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌.. ఫ్యాన్‌ ఆఫ్‌ ఇండియా!

Published Sun, Sep 15 2024 3:34 AM | Last Updated on Sun, Sep 15 2024 3:34 AM

Life Story Of Popular Actress And Singer Sanam Saeed Funday Sakshi Story

సనమ్‌ సయీద్‌.. బ్రిటిష్‌ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్‌ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.

  • సనమ్‌ పుట్టింది లండన్‌లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్‌లో గడిచింది. ఫిల్మ్‌ అండ్‌ థియేటర్‌ స్టడీస్‌లో డిగ్రీ చేసింది.

  • ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్‌ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్‌టీవీ (పాకిస్తాన్‌)లో వీజేగా కనిపించింది.

  • ‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్‌’ అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్‌ స్టూడియో పాకిస్తాన్‌లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.

  • సనమ్‌ మల్టీటాలెంట్‌ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్‌ ఎ మీర్‌’, ‘దొబారా ఫిర్‌ సే’, ‘ఇశ్రత్‌ మేడ్‌ ఇన్‌ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.

  • సనమ్‌ను మనకు ఇంట్రడ్యూస్‌ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్‌ ‘జిందగీ గుల్జార్‌ హై’. ఇది హమ్‌ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్‌ ఆమెకు ఇండియన్‌ ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పరచింది.

  • ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్‌ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్‌ ఇచ్చింది.. ‘కాతిల్‌ హసీనాఓం కే నామ్‌’తో! ఇది జీ5లో స్ట్రీమ్‌ అవుతోంది.

  • మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్‌.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌’.

'ఇండియాలో నాకు ఫ్యాన్స్‌ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్‌ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్‌తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'

ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement