విదేశాల్లో లక్షల జీతం వచ్చే ఉద్యోగం ఉన్న.. అలాగే అన్ని సౌకర్యాలు ఉన్నా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌లో సక్సెస్ అయితే ఆ కిక్కే వేరు.. ఎందుకంటే.. దానికున్న గౌరవం.. విలువ చాలా గొప్పది.
ఆయన నానో టెక్నాలజీ మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనలకు గాను.. ఆయనకు అమెరికాలో లక్షల జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. అయితే.. ఆ లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. ఈ సివిల్స్ సాధించడం కోసం ఎంతోకష్టపడ్డాడు. ఆయన కష్టాన్నికి యూపీఎస్సీ సివిల్స్ 2020 ఫలితాల్లో జాతీయ స్థాయిలో.. ఏకంగా 29వ ర్యాంక్ సాధించాడు. చివరికి ఐఏఎస్ కావలనే కలను నిరవేర్చుకున్నాడు. ఈయనే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతానికి చెందిన ప్రఖర్ సింగ్. ఈ నేపథ్యంలో ప్రఖర్ సింగ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
ప్రఖర్ సింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతానికి చెందిన వారు. తండ్రి కేదార్ సింగ్. ఇన్‌స్పెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ప్రఖార్ చిన్నతనంలోనే.. అతని తండ్రి పని కారణంగా బయట ఉండవలసి వచ్చింది. అలాంటి పరిస్థితిలో, అతని తల్లి సవితా సింగ్ కుటుంబాన్ని చూసుకునేది. ఆమె జూనియర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ప్రఖర్ తన తల్లి నుంచి ప్రేరణ పొందేవాడు. తండ్రి దగ్గరే క్రమశిక్షణ నేర్చుకున్నాడు. ఒక ఐపిఎస్ అధికారి పాత్రబాధ్యత ఏమిటో కూడా అతను చెప్పేవారు.
ఎడ్యుకేషన్ :
ప్రఖర్ సింగ్ .. తొలినాళ్ల నుంచి చదువుతో ప్రతిభ కనబరిచే వారు. రాంపూర్‌లోని దయావతి మోదీ అకాడమీలో 12వ తరగతి వరకు చదివాడు. 12వ తరగతిలో 98 శాతం మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఐఐటీ రూర్కీలో ప్రవేశం పొందాడు. 2015 నుండి 2019 వరకు, అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఈ క్రమంలో యూఎస్ వెళ్లే అవకాశం కూడా వచ్చింది. 2018 సంవత్సరంలో, మూడవ సంవత్సరం ముగింపులో, అతను ఇంటర్న్‌షిప్‌పై US వెళ్ళాడు. అక్కడ నానోటెక్నాలజీలో పరిశోధన చేసి తిరిగి వచ్చాడు. స్కాలర్‌షిప్ ద్వారా యుఎస్ వెళ్లాడు. ఆ స్కాలర్‌షిప్ ద్వారా దేశం నలుమూలల నుంచి 19 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాంటిది అవన్నీ వదలుకోని యూపీఎస్సీ కోసం కసరత్తులు చేశాడు.
సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కావడంలో స్థిరత్వం క్రమశిక్షణ పాటించాలని ప్రఖర్ చెప్పారు. అలాగే పరధ్యానాన్ని విస్మరించండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తల్లిదండ్రులు, స్నేహితులతో సంతోషంగా మాట్లాడండి. అలాగే వీరితో సన్నిహితంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షను ఆధారిత పద్ధతిలో చదవండి. మీపై మీరు విశ్వాసాన్ని ఉంచుకోండి. యూపీఎస్సీ ప్రయాణం మారథాన్ లాంటిదని ప్రఖర్ సింగ్ అన్నారు. ఇది ఒక సంవత్సరం లేదా ఆరు నెలల తయారీ కాదు. మీ వ్యక్తిత్వం.. మీ ఆలోచన ప్రక్రియ దీర్ఘకాలం మీద ప్రభావం చూపుతుంది. నేను చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు చదివేవాడిన. దీని వల్ల జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ వైపు మొగ్గు చూపాను.
ప్రతి వ్యక్తి జీవితంలో పోరాటం ఉంటుంది. ఎవరో జాబ్ చేస్తున్నారో లేదో.. మీకు అవసరం లేదు. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ కాకపోయినా, కాస్త సమయం కేటాయించి మంచి పుస్తకాలు చదవాలి. అతను ఎల్లప్పుడూ తన ఆలోచన విధానాన్ని రిఫ్రెష్ చేసేవాడు. మీలో కొత్త ఆలోచనలు రావాలి. నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రక్రియ. ఇది ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలి. ఎప్పుడూ కొత్త పుస్తకాలు చదవండి. కొత్త వ్యక్తులను కలవండి. కొత్త ఆలోచనలను వినండి. ఆశావహులు ప్రిపరేషన్‌లో బిజీగా ఉంటారు. మీరు ప్రిపరేషన్‌లో స్థిరత్వం.., క్రమశిక్షణను పాటిస్తే.. మీరు బెస్ట్‌గా నిలుస్తారు. స్నేహితుల నుంచి మారల్ మద్దతు లభిస్తుంది. ఏం చదవాలి, ఎలా చదవాలి అనే చర్చ జరుగుతోంది. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది చూపిస్తుందన్నారు
ప్రస్తుతం సోషల్ మీడియా మంచి పాత్ర పోషిస్తోందని చెప్పారు. చాలా వెబ్‌సైట్‌లలో మంచి కంటెంట్‌ను చూడవచ్చు. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి బదులుగా, మీరు దాన్ని ఉపయోగించండి. మీరు వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రిపరేషన్ సమయంలో నేను తన సోషల్ మీడియా ఖాతాను కూడా డీయాక్టివేట్ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment