సాధించాలనే సంకల్పం నీకుంటే విజయం తప్పకుండా దాసోహం అంటుంది. ఈ మాటకు రూపం పోస్తే అతడే 'యష్ సోనాకియా' (Yash Sonakia). ప్రతిభకు ఏ శారీరక లోపం అడ్డు కాదు అని నిరూపించాడు. తన ఎనిమిదవ ఏటనే చూపో కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా మైక్రోసాఫ్ట్ కంపెనీలు జాబ్ కొట్టాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌కి చెందిన యష్ సోనాకియా పుట్టినప్పుడే అతనికి గ్లాకోమా ఉందని డాక్టర్లు నిర్దారించారు. అయితే అతనికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి చూపు కోల్పోయాడు. చిన్నప్పటి నుంచి సాఫ్ట్‌వేర్ కావాలని కళలు కన్న యష్ చూపు కోల్పోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా తన వైకల్యాన్ని అధిగమించి 2021లో శ్రీ గోవింద్రం సెక్సరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (SGSITS) నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
(ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!)
ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత యష్ సోనాకియాకు ఒక మంచి బంపర్ ఆఫర్ లభించింది. అతనికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ 47 లక్షల వార్షిక వేతనం అందిస్తూ జాబ్ ఇచ్చింది. కళ్ళు లేని వ్యక్తి ఇంత గొప్ప ప్యాకేజీతో జాబ్ సంపాదించడం అనేది సాధారణ విషయం కాదు. యష్ తండ్రి యశ్‌పాల్ ఇండోర్‌లో క్యాంటీన్ నడుపుతున్నాడు. తన కొడుకు ఇంత మంచి జాబ్ తెచుకున్నందుకు పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment