ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు! | Meet Pramod Gautam, India's richest farmer who left engineering job - Sakshi
Sakshi News home page

ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు!

Published Fri, Sep 8 2023 11:24 AM | Last Updated on Fri, Sep 8 2023 11:56 AM

Indias richest farmer Pramod Gautam success story - Sakshi

ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేసేవారు మాత్రమే ఎక్కువ సంపాదిస్తారని చాలామంది నమ్మకం. అయితే ఆధునిక కాలంలో చదువు మాత్రమే కాదు తెలివితేటలతో కూడా బాగా సంపాదించవచ్చని ఎంతోమంది నిరూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన 'ప్రమోద్ గౌతమ్‌'.

మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ గౌతమ్‌ ఇంజనీర్ జాబ్ వదిలి, భారతదేశంలోని ధనిక రైతులలో ఒకరుగా మారి.. ఐఐటీ, ఐఐఎమ్, కొన్ని కంపెనీలలో పనిచేసే సీఈఓల కంటే ఎక్కువ సంపాదిస్తూ.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నిజానికి ఇతడు MNCలో  ఆటోమొబైల్ ఇంజనీర్‌గా పని చేసేవాడు.

హార్టికల్చర్..
ఉద్యోగంలో సంతృప్తి చెందని ప్రమోద్ జాబ్ వదిలి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకున్న 26 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు కాకుండా హార్టికల్చర్ (ఉద్యాన పంటలు) విధానం ఎంచుకుని గ్రీన్‌హౌస్‌లో పండ్లు, కూరగాయలను పండించాడు.

ప్రారంభంలో వేరుశెనగ, పసుపు సాగుతో చిన్నగా ప్రారంభించాడు. కానీ పెద్దగా లాభం లేకపోవడంతో పప్పుకి సంబంధించిన పంటలు పండించాలనుకున్నాడు. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి మంచి దిగుబడులను పొందాడు. తరువాత అతి తక్కువ కాలంలోనే వందన ఫుడ్స్‌ ప్రారంభించి దీని కింద వివిధ రకాల పప్పులు, ధాన్యాలను విక్రయించడం ప్రారంభించాడు. ఈ ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు..

ఇక ప్రమోద్ గౌతమ్‌ ఆదాయం విషయానికి వస్తే.. ఇతడు నెలకు రూ. 10 నుంచి రూ. 12 లక్షలు సంవత్సరానికి సుమారు రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం దేశంలోనే అత్యంత ధనిక రైతుగా నిలిచాడు. వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రోజు దేశంలోని టాప్ 10 ధనిక రైతులలో ఒకరుగా నిలిచారు.

(Disclaimer: వ్యవసాయం అనేది అందరికి లాభాలను తెచ్చిపెట్టకపోవచ్చు, కావున ఉద్యోగాలు వదిలి ఇలాంటివి చేయడం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి సాహసాలు చేయాలనుకునే వారు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement