Sanjeev Juneja Who Earned Crores From Rs 2000 And His Success Story In Telugu - Sakshi
Sakshi News home page

Sanjeev Juneja Success Story: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!

Published Thu, Jun 22 2023 4:06 PM | Last Updated on Thu, Jun 22 2023 6:11 PM

Sanjeev Juneja Who Earned Crores From Rs 2000 and his success story - Sakshi

Sanjeev Juneja Success Story: జీవితంలో ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు, కష్ట & నష్టాలు లెక్కకు మించి ఎదుర్కోవాలి ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకుంటున్న విజయవంతమైన వ్యక్తులలో చాలా మంది ఇలా ఎదిగినవారే. ఈ కోవకు చెందిన వారిలో 'సంజీవ్ జునేజా' (Sanjeev Juneja) ఒకరు. తన తల్లి దగ్గర నుంచి రూ. 2000 తీసుకుని వ్యాపారం ప్రారంభించి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యానికి మహారాజుగా ఎంతో మందికి ఆదర్శప్రాయుడయ్యాడు. ఇంతకీ సంజీవ్ ఎవరు? ఎలా సక్సెస్ సాధించాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సంజీవ్ జునేజా.. అంబాలలో ఒక ప్రముఖ వైద్యుడుగా ప్రసిద్ధిచెందిన డాక్టర్ IK జునేజా కొడుకు. ఈయన ఒక చిన్న క్లినిక్ నడుపుతూ ఉండేవాడు. జునేజా తన తండ్రిని 1999లో కోల్పోయాడు. అప్పటికే సొంతంగా ఏదైనా చేయాలనే సంకల్పం ఉన్న ఇతడు తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి చనిపోక ముందే ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడు. తండ్రి మరణానంతరం ఇవన్నీ అతనికి ఉపయోగపడ్డాయి.

2003లో సంజీవ్ జునేజా రాయల్ క్యాప్సూల్స్‌తో తన కంపెనీని ప్రారంభించాడు. ఆ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి 2008లో హెయిర్ కేర్ ఫార్ములా స్టార్ట్ చేసాడు. ఇది అతి తక్కువ కాలంలోనే పాపులర్ బ్రాండ్‌గా ఎదిగింది. ఆ బ్రాండ్ పేరే 'కేశ్ కింగ్'. ఈ ఉత్పత్తులను ప్రారంభంలో ఇంటింటికి తిరిగి విక్రయించడం ప్రారంభించారు. ఆ తరువాత వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టాడు.

(ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్‌ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!)

కేశ్ కింగ్ ప్రారంభమైన ఆనతి కాలంలోనే సుమారు రూ. 300 కోట్లు బ్రాండ్‌గా అవతరించింది. ఇమామి కేశ్ కింగ్ సంస్థను రూ. 1651 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత పెట్ సఫా అనే మరో ఉత్పత్తిని తయారు చేశాడు. దీనికి రాజు శ్రీవాస్తవ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈయన డాక్టర్ ఆర్థోకి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

(ఇదీ చదవండి: నేచురల్ పద్దతిలో కోట్లు సంపాదిస్తున్న మహిళ - 50 ఏళ్ల వయసులో..)

సంజీవ్ జునేజా కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లో పరిచయం చేస్తూ ఎన్నో విజయాలను సాధించాడు. ప్రారంభంలో ఒక చిన్న గదిని ఆఫీసుగా చేసుకుని కేష్ కింగ్ హెయిర్ ఆయిల్ విక్రయాలతో నేడు రూప్ మంత్ర, పెట్ సఫా, డాక్టర్. ఆర్థో, సచి సహేలి, అక్యుమాస్, దంతమణి, మధుమణి, మోర్ పవర్, రాజ్సీ, తులసి మంత్రం అనే అనేక ఉత్పత్తులు ప్రారభించాడు. నేడు భారతదేశంలో గొప్ప వ్యాపార వేత్తగా మాత్రమే కాకుండా మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇప్పుడు ఆయన సంపాదన వేళా కోట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement