haldiram products
-
బ్లాక్‌స్టోన్ చేతికి హల్దీరామ్స్!
న్యూఢిల్లీ: స్నాక్స్ తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి ప్రయివేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీతో జత కట్టిన బ్లాక్‌స్టోన్ కొద్ది నెలలుగా హల్దీరామ్స్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే బిజినెస్ విలువ విషయంలో అంగీకారం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. కాగా.. స్నాక్స్ విభాగంలో దేశీయంగా ప్రధాన కంపెనీగా నిలుస్తున్న హల్దీరామ్స్‌లో నియంత్రిత వాటాను సొంతం చేసుకునేందుకు బ్లాక్‌స్టోన్ ఇంక్ ప్రస్తుతం చర్చల్లో ఇటీవల పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం రూ. 70,000 కోట్ల విలువలో హల్దీరామ్స్ కొనుగోలుకి డీల్ కుదిరే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 76%పై కన్ను హల్దీరామ్స్‌లో 76 శాతం వాటా కొనుగోలుపై బ్లాక్‌స్టోన్ కన్సార్షియం కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే అగర్వాల్ కుటుంబం భారీ వాటా విక్రయానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ విలువ నిర్ధారణలోనూ అంగీకారం కుదరనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లలో కొంతమంది 51 శాతం వాటా విక్రయానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఒప్పందం కుదిరితే దేశీయంగా అతిపెద్ద పీఈ డీల్‌గా చరిత్ర సృష్టించే వీలున్నట్లు పేర్కొన్నాయి. చర్చలు ఏక్షణమైనా విఫలమైతే ఇతర ప్రత్యామ్నాయాలను సైతం అగర్వాల్ కుటుంబం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఇష్యూకి సైతం తెరతీసే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. అగర్వాల్ కుటుంబం ఢిల్లీ, నాగ్‌పూర్ బ్రాంచీల ఎఫ్ఎంసీజీ బిజినెస్‌ను విలీనం చేసే ప్రణాళికల్లో ఉంది. హల్దీరామ్ స్నాక్స్ పీవీటీ లిమిటెడ్, హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ పీవీటీ లిమిటెడ్ విలీనం ద్వారా హల్దీరామ్ స్నాక్ ఫుడ్స్ పీవీటీ లిమిటెడ్‌గా ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీలో ఢిల్లీ బ్రాంచ్ 56 శాతం, నాగ్‌పూర్ బ్రాంచ్ 44 శాతం చొప్పున వాటాను తీసుకోనున్నాయి. -
రిజర్వేషన్లపై ఆందోళనలు.. మంత్రికి చేదు అనుభవం..
ముంబయి: రిజర్వేషన్ల అంశంలో మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణం విఖే పాటిల్‌కి చేదు అనుభవం ఎదురైంది. రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు మంత్రి రాధాకృష్ణం విఖే పాటిల్‌పై దురుసుగా ప్రవర్తించారు. మాట్లాడుతున్న క్రమంలో ఆయనపై పసుపు పోశారు. పక్కనే ఉన్న మంత్రి అనుయాయులు ఆ అభ్యర్థిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌పై మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు వినతిపత్రం ఇవ్వడానికి కొంత మంది అభ్యర్థులు వచ్చారు. వినతిపత్రం మంత్రికి అందించారు. ఆ లేఖను చదివే క్రమంలో మంత్రి తలపై పసుపును ఒక్కసారిగా పోశారు. ఈ అనుకోని సంఘటనతో ఆయన దూరంగా జరిగారు. Video: Man Throws Haldi At Maharashtra Minister, Warns Chief Minister https://t.co/zQTGSfboXq pic.twitter.com/zrvqRWvQC7 — NDTV (@ndtv) September 8, 2023 పక్కనే ఉన్న మంత్రి అనుయాయులు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పక్కకు తోశారు. అనంతరం అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి.. తనపై పసుపు పోయడం శుభమేనని అన్నారు. ఇది తప్పుడు చర్య ఏం కాదని అన్నారు. దీనిని తాను సానుకూలంగా తీసుకున్నట్లు చెప్పారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏకంగా రాష్ట్ర సీఎం మీద కూడా ఇంక్ పోస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. తమ ధంగర్ కమ్యునిటీని షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద పరిగణించాలని డిమాండ్ చేశారు. అయితే.. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా రిజర్వేషన్ల గొడవ కొనసాగుతోంది. ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు.. -
11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!
సాధారణంగా ఫుడ్ కంపెనీ అనగానే చాలా మందికి డామినోస్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ వంటివి గుర్తుకు వస్తాయి. కానీ అలాంటి కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇచ్చిన ఇండియన్ బ్రాండ్ 'హల్దీరామ్' (Haldiram) గురించి బహుశా తెలియకపోవచ్చు. ప్రపంచంలో దాదాపు 80 దేశాలలో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ గురించి.. దీనికి మూల కారకుడైన వ్యక్తి గురించి ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. 'గంగ బిషన్ అగర్వాల్' (Ganga Bishan Agarwal) 1937లో బికనీర్‌లో చిన్న స్నాక్స్ వ్యాపారంగా మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని స్నాక్స్ ఫుడ్స్ వ్యాపారంలో రెండవ స్థానానికి చేరుకునేలా చేసాడు, అంటే దీని వెనుక ఉన్న అతని కృషి పట్టుదల స్పష్టంగా తెలుస్తాయి. నిజానికి ఒక చిన్న భుజియా దుకాణంతో ప్రారంభమైన ఆయన వ్యాపారం, కుటుంబ కలహాలు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ రోజు ప్రపంచమే గుర్తించే స్థాయికి ఎదిగింది. గంగ బిషన్ ఉరఫ్ అగర్వాల్‌ని తన తల్లి ముద్దుగా 'హల్దీరామ్' అని పిలుచుకునేది. ఆ పేరే తరువాత కంపెనీ బ్రాండ్‌గా మారింది. వీరి కుటుంబానికి చెందిన ఒక మహిళ తరచుగా బికనీరీ భుజియా తయారు చేసేదని, దాన్ని తన తల్లి ద్వారా బిషాన్ నేర్చుకున్నట్లు సమాచారం. భుజియాతో విజయం.. గంగా బిషన్ అగర్వాల్ 1919లో కేవలం 11 ఏళ్ల వయసులోనే కంపెనీ స్థాపించాలని కలలు కనేవాడు. చిన్న తనం నుంచి భుజియా తయారు చేయడం మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఎందుకంటే ఆ సమయంలో భుజియా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే వ్యాపారులు డబ్బు మీద పెట్టే ద్రుష్టి.. రుచి మీద పెట్టేవారు కాదు. కావున బిషన్ మార్కెట్లో మంచి రుచిని అందించే చిరుతిండి వ్యాపారాలను సృష్టించడానికి కంకణం కట్టుకున్నాడు. దీంతో అనేక ప్రయత్నాలు చేసి బికనీర్ ప్రజలు మునుపెన్నడూ రుచి చూడని కొత్త రకం భుజియాను రూపొందించడంలో అతను విజయం సాధించాడు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) కలకత్తాలో దుకాణం.. మార్కెట్లో మంచి పేరు సంపాదించిన తరువాత అమ్మకాల పరంగా వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. అతడు ఏడు పదుల వయసులోనూ ఊరంతా సైకిల్ మీదే తిరిగేవారట, అంతే కాకుండా ఆయన ఒకసారి కోల్‌కతాలో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక దుకాణం ఏర్పాటు చేయాలనుకుని, అక్కడ షాప్ ప్రారంభించారు. బికనీర్‌లో కాకుండా బయట ప్రారంభించిన మొట్టమొదటి దుకాణం అదే. ఈ విధంగా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఆయన మనవళ్లు కూడా దీని అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) 80 దేశాల్లో విక్రయాలు.. భారతదేశంలో నాగపూర్, ఢిల్లీ ప్రాంతాల్లో వీరికి బ్రాంచీలు ఉన్నాయి. విదేశాల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. వీరి ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. హల్దీరామ్ బ్రాండ్‌లో వెజ్ షమీ కెబాబ్, సోయా షమీ కెబాబ్, దహీ కెబాబ్, హరాభరా కెబాబ్లను తయారు చేసేవారు. ఆ తరువాత రసగుల్లా, సోమ్ పాపిడీ, పానీపురీ వంటివి కూడా ప్రారంభించారు. హల్దీరామ్ ప్రస్తుత చైర్మన్ మనోహర్ లాల్ అగర్వాల్. ప్రస్తుతం వీరు రూ. వేల కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. -
కాలం చెల్లిన హల్దీరామ్ ప్రోడక్ట్స్ విక్రయం
-
భుజియాతో బిలియన్లు...
గంగ భిశాణ్ ఉరఫ్ హల్దీరామ్... భుజియా నుంచి బిలియన్లకు చేరారు... ఒకటి రెండు కాదు మూడు బిలియన్లు... ప్రపంచ స్నాక్స్‌లో ద్వితీయస్థానానికి చేరారు.. ఎనిమిది దశాబ్దాలుగా తిండి ప్రియులకు రుచులు అందిస్తున్న గంగా భిశాణ్ స్థాపించిన హల్దీరామ్స్ విజయగాథ ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... బికనీర్‌లో 1937లో అతి సామాన్యంగా ప్రారంభమైన స్నాక్స్ వ్యాపారం... ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ ఈ రోజు ప్రపంచంలోనే స్నాక్ ఫుడ్స్ వ్యాపారంలో రెండో స్థానానికి చేరుకుంది. బ్రేక్ ఫాస్ట్ ఉత్పత్తులైన కెలాగ్స్ కూడా హల్దీరామ్స్‌లో చేరింది. ఇప్పుడు వీరి టర్నోవర్ మూడు బిలియన్ల డాలర్లకు (కలకత్తా మినహా) చేరుకుంది. ఒక చిన్న భుజియా దుకాణంతో ప్రారంభమైన ఈ వ్యాపారం, కుటుంబ కలహాలను, అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ అత్యున్నతస్థాయికి చేరుకుంది. విలవలతో... హల్దీరామ్స్ పేరు భారతదేశ ఖ్యాతికి కలికితురాయిగా నిలిచింది. 1937లో బికనీర్‌లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ దుకాణం ఇప్పుడు ప్రపంచస్థాయికి ఎదిగింది. గంగా భిశాణ్ అగర్వాల్‌ని తల్లి ముద్దుగా హల్దీరామ్ అని పిల్చుకునేది. భిషాణ్ ఆంటీ ఒకరు వీరి ఇంట్లోనే తరచుగా బికనీరీ భుజియా తయారుచేస్తుండేది. అది చాలా రుచిగా ఉండటంతో, అగర్వాల్ తల్లి ఆవిడ దగ్గర నేర్చుకుంది. తల్లి దగ్గర అగర్వాల్ నేర్చుకున్నారు. బికనీర్‌లోని భుజియా బజార్లో ఉన్న తన బంధువుల దుకాణంలో చేరిన తరవాత, తన ఆంటీ ఉపయోగించిన విధానాన్ని అనుసరించారు అగర్వాల్. పవిత్ర కుమార్ రచించిన ‘భుజియా బ్యారన్స్’లో అగర్వాల్ కనిపెట్టిన కొత్తవిధానంలో భుజియా తయారుచేయడం గురించి ప్రస్తావించాడు. ఒకరకమైన పిండిని జతచేసి దానితో సన్నటిమెష్ మీద భుజియా తయారు చేసేవాడు. తన కొత్త ఉత్పత్తిని ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలో అగర్వాల్‌కి బాగా తెలుసు. బికనీర్ని పరిపాలించిన మహారాజులలో దంగర్‌కి మంచి పేరు ఉంది. ఆయన పేరు మీదే ‘దంగర్ సేవ్’ అని పేరు పెట్టాడు. అంతే! ఆయన దశ మారిపోయింది. మార్కెట్లో మంచి పేరు సంపాదించేశాడు. వారానికి రెండు వందల కిలోలు అమ్మడం ప్రారంభించాడు. కిలో ధర 2 పైసల నుంచి 25 పైసలకి పెరిగింది’ అని పవిత్ర కుమార్ తన పుస్తకంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇలా మొదలైంది... అగర్వాల్ పొడవుగా, సన్నగా, ఆరోగ్యంగా ఉండటంతో, పిల్లలకు, మనవలకు కూడా అగర్వాల్ అంటే చాలా భయం వేసేదట. ఆయన చాలా తక్కువగా నవ్వుతారట. డెబ్బై సంవత్సరాలు నిండాక కూడా తన ఊరంతా సైకిల్ మీదే తిరిగేవారట. హల్దీరామ్ ఒకసారి కోల్‌కతాలో ఒక పెళ్లికి వెళ్లినప్పుడు, అక్కడ కూడా ఒక షాపు తెరవాలనే ఆలోచన కలిగిందట. బికనీర్‌లో కాకుండా బయట ప్రారంభించిన మొట్టమొదటి దుకాణం అదే. ఆయన తరవాతి తరం వారు వ్యాపారాన్ని పెద్దగా వృద్ధి చేయలేదు. మనమలు మనోహర్‌లాల్ శివకిషన్ ఈ వ్యాపారానికి వారసులుగా నిలిచి, నాగపూర్, ఢిల్లీలలో బ్రాంచీలు తెరిచారు. ఢిల్లీలోని చాందినీచౌక్‌లో షాపు తెరిచిన కొత్తల్లోనే అందరినీ ఆకట్టుకోవటంతో, ఢిల్లీ, నాగపూర్లలో ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించారు. ఆ తరవాత పెద్ద పెద్ద నగరాలలో, విదేశాలలో రెస్టారెంట్లు తెరిచారు. మొత్తం 20 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. గంగాభిశాణ్ వారసులు ట్రేడ్‌మార్కు గురించి వాదులాడుకున్నారు. ఇప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులోనే ఉంది. బికనీర్ నుంచి ఫ్రెంచ్ బేకరీ దాకా... 1937లో బికనీర్‌లో గంగా భిశాణ్ భుజియా షాప్ ప్రారంభించినప్పుడు, హల్దీరామ్ స్వయంగా వెజ్ షమీ కెబాబ్, సోయా షమీ కెబాబ్, దహీ కెబాబ్, హరాభరా కెబాబ్లను తయారు చేసేవారు. క్రమేపీ ఇక్కడ రసగుల్లా, సోమ్ పాపిడీ, పానీపురీ... వంటివి కూడా ప్రారంభించారు. కెలాగ్స్ ఇందుకే ఇటు వచ్చింది... ఎంత విదేశీ మార్కెట్లయినా దేశీ మార్కెట్లతో కలిస్తేనే స్థానికత ఉంటుందనే ఉద్దేశంతో, హల్దీరామ్స్లోకి వచ్చి చేరిపోయింది కెలాగ్స్. మెక్డెనాల్డ్స్ మొట్టమొదట 1996లో ఢిల్లీ బసంత్లోక్లో ప్రారంభమైనప్పుడే, ఇక్కడ బీఫ్, పోర్కుకి సంబంధించిన ఉత్పత్తులు తయారుచేయకూడదని ఒక సంప్రదాయ నిర్ణయం తీసుకున్నారు. అందుకే అవి విదేశీ కంపెనీలైనా భారతీయతను సంతరించుకున్నాయి. హల్దీరామ్ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేయడం కోసం, ఫ్రెంచ్ బేకరీ కేఫ్ బ్రియోక్ డోరేతో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద చైన్ బేకరీ ఇది. ఇక్కడ కూడా శాకాహారం మాత్రమే దొరుకుతుంది. గంగ భిశాణ్ ఉరఫ్ హల్దీరామ్ -
హల్దీరామ్ ఉత్పత్తులపై అమెరికా నిషేధం
హల్దీరామ్ ఉత్పత్తుల్లో క్రిమిసంహారక మందులు మోతాదుకు మించి ఉంటున్నాయని, కొన్నింటిలో ఫంగస్‌తో పాటు టైఫాయిడ్ కారక సాల్మోనెల్లా క్రిములు ఉంటున్నాయని పేర్కొంటూ.. ఆ ఉత్పత్తులను అమెరికా నిషేధించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి హల్దీరామ్ ఉత్పత్తులన్నింటినీ త క్షణమే తనిఖీ చేయాలని 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' (ఎఫ్‌డీఏ)ను ఆదేశించింది. నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు ముందుగా స్పందించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. నాగపూర్‌కు చెందిన హల్దీరామ్ కంపెనీ రాష్ట్రంలోనే ఉన్నందున, వాటి ఉత్పత్తుల వినియోగం కూడా ఎక్కువే ఉన్నందున ఈ అంశంపై తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని, శాంపుల్స్‌ను సేకరించి వీలైనంత త్వరగా పరీక్షించాలని కోరుతూ ఎఫ్‌డీఏ కమిషనర్ హర్షదీప్ కాంబ్లీకి రాష్ట్ర ఎఫ్‌డీఏ సహాయ మంత్రి విద్యాఠాకూర్ లేఖ రాశారు. హల్దీరామ్ ఫుడ్ కంపెనీని నాగపూర్‌లో 1937లో గంగాబైసేంజీ అగర్వాల్ ఏర్పాటుచేశారు. తొలుత కుటుంబ పరిశ్రమగా ఉన్న ఈ కంపెనీ వారసుల విభజనతో ఇతర శాఖలు వెలిశాయి. ఇప్పటికీ నాగపూర్ కాకుండా ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రమే కుటుంబ సభ్యుల బ్రాంచులు ఉన్నాయి. కొన్ని నగరాల్లో ఇతర వ్యాపారస్థులకు ఫ్రాంచైజీలు ఇచ్చారు. హల్దీరామ్ ఉత్పత్తులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయ్‌లాండ్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.