మస్కా మజాకా! | Elon Musk Tamil meme dig at Apple-OpenAI partnership spins amusing X reactions | Sakshi
Sakshi News home page

మస్కా మజాకా!

Published Sun, Jun 16 2024 4:15 AM | Last Updated on Mon, Jun 17 2024 10:50 AM

Elon Musk Tamil meme dig at Apple-OpenAI partnership spins amusing X reactions

వైరల్‌

తన ‘తప్పట్టం’ సినిమా పోస్టర్‌ను ‘వరల్డ్‌–ఫేమస్‌’ చేసినందుకు ఎలాన్‌ మస్క్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు  తమిళ చిత్ర నిర్మాత ఆదమ్‌ భవా. ‘హౌ ఇంటెలిజెన్స్‌ వర్క్స్‌’ కాప్షన్‌తో డిజైన్‌ చేసిన మీమ్‌ పోస్టర్‌ను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశాడు మస్క్‌. ఈ పోస్టర్‌లో ఇద్దరు నటులు కొబ్బరి నీటిని షేర్‌ చేసుకుంటూ కనిపిస్తారు. 

ఈ కొబ్బరినీటి షేరింగ్‌ను యాపిల్, ఓపెన్‌ ఏఐల మ«ధ్య డేటా షేరింగ్‌ డైనమిక్స్‌తో పోల్చుతుంది ఈ మీమ్‌. అంత పెద్ద ఎలాన్‌ మస్క్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేయడంతో ‘తపట్టం’ సినిమా పోస్టర్‌ రాత్రికి రాత్రే వైరల్‌ అయింది. లక్షల వ్యూస్‌తో దూసుకు పోతుంది. ఈ పోస్టర్‌ పుణ్యమాని యాపిల్‌–ఓపెన్‌ ఏఐ భాగస్వామ్యం గురించి చర్చ కూడా జరుగుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement