Data Transfer
-
మస్కా మజాకా!
తన ‘తప్పట్టం’ సినిమా పోస్టర్‌ను ‘వరల్డ్–ఫేమస్’ చేసినందుకు ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు తమిళ చిత్ర నిర్మాత ఆదమ్ భవా. ‘హౌ ఇంటెలిజెన్స్ వర్క్స్’ కాప్షన్‌తో డిజైన్ చేసిన మీమ్ పోస్టర్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశాడు మస్క్. ఈ పోస్టర్లో ఇద్దరు నటులు కొబ్బరి నీటిని షేర్ చేసుకుంటూ కనిపిస్తారు. ఈ కొబ్బరినీటి షేరింగ్‌ను యాపిల్, ఓపెన్ ఏఐల మ«ధ్య డేటా షేరింగ్ డైనమిక్స్‌తో పోల్చుతుంది ఈ మీమ్. అంత పెద్ద ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో ‘తపట్టం’ సినిమా పోస్టర్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. లక్షల వ్యూస్‌తో దూసుకు పోతుంది. ఈ పోస్టర్ పుణ్యమాని యాపిల్–ఓపెన్ ఏఐ భాగస్వామ్యం గురించి చర్చ కూడా జరుగుతుంది. -
ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా తెలుకునేందుకు ఇంటర్నెట్లో వెతుకుతుంటాం. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. అందుకే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోనే అధిక ట్రాఫిక్ కలిగిన ఇంటర్నెట్ను సరఫరాచేసి రికార్డు నెలకొల్పారు. ఆప్టికల్ఫైబర్ ద్వారా సెకనుకు 22.9 పెటాబిట్ల డేటాను సరఫరాచేసి రికార్డు సృష్టించారు. అక్టోబర్‌లో స్కాట్లాండ్లో జరిగిన యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టికల్ కమ్యూనికేషన్లో ఈ పరిశోధన నివేదికను సమర్పించారు. జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) సెకనుకు 22.9 పెటాబిట్ల(1 పెటాబిట్ అంటే 10 లక్షల గిగాబిట్లకు సమానం) డేటా ట్రాన్స్మిషన్ రేటును అధిగమించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ కలిగిన డేటాను ఇంటర్నెట్ ద్వారా సరఫరా చేశారు. దీంతో ఇంటర్నెట్లోని మొత్తం ట్రాఫిక్‌ను సెకండ్ బై సెకండ్ 22 సార్లు ప్రసారం చేయవచ్చు. నాసా కూడా కూడా సెకనుకు 46 టెరాబిట్ల డేటాను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా దాదాపు సెకనుకు 10 గిగాబిట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కానీ చాలావరకు సెకనుకు వందల మెగాబిట్ డేటాను మాత్రమే సరఫరా అవుతోంది. అయితే తాజాగా ఎన్ఐసీటీ సెకనుకు 22.9 పెటాబిట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్‌ను సాధించడానికి కొన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించింది. డేటాను ప్రసారం చేయడానికి ఒక కోర్ ఛానల్‌కు బదులుగా, 38 ఫైబర్కేబుళ్లను వినియోగించింది. వీటిలో ఒక్కోటి 3 మోడ్ల చొప్పున మొత్తం 114 ఛానెల్‌ల ద్వారా డేటాను ప్రసారం చేశారు. ప్రతి ఛానెల్లోని ప్రతి మోడ్ ద్వారా 750 వేవ్లెంత్, 18.8 టెరాహెడ్జెస్ బ్యాండ్‌విడ్త్‌తో ఈ డేటాను పంపించినట్లు తెలిసింది. అయితే కనెక్షన్లోని కొన్ని లోపాలు సవరించి ఆప్టిమైజ్ చేయడం వల్ల దాని ప్రస్తుత వేగం సెకనుకు 24.7 పెటాబిట్కు చేరుకోగలదని బృంద సభ్యులు తెలిపారు. ఇదీ చదవండి: జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ అయితే, ఇకపై మనకు కావాల్సిన ఎంత డేటా అయినా సెకనులో డౌన్లోడ్ చేసుకోవచ్చని అనుకుంటున్నారేమో. ఈ డేటాను డీకోడ్ చేయడానికి సంక్లిష్టమైన సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుందని చెప్పింది. దీనికి ఎంఐఎంఓ రిసీవర్లు అని పిలువబడే ప్రత్యేక పరికరాలు నెట్‌వర్క్‌లో ఇన్స్టాల్ చేయాలని వివరించింది. ప్రస్తుతం 4 కోర్ వర్షన్ ద్వారా ఒక్కోమోడ్ విధానంలో సెకనుకు 1 పెటాబిట్ డేటా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని తెలిపింది. -
వాట్సాప్ స్టేటస్తోనూ సమాచార వ్యాప్తి
ముంబై: వాట్సాప్ యాప్ ద్వారా ఇతరులకు సమాచారం అందించాలనుకునే వారు బాధ్యతాయుత వైఖరి కలిగి ఉండాలని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం పేర్కొంది. వాట్సాప్ ద్వారా మతాల మధ్య విద్వేషాలను పెంచుతున్నారంటూ ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. వాట్సాప్ స్టేటస్‌తో యూజర్లు తమ ఉద్దేశాలను ఇతరులకు తెలియజేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ ఈ నెల 12న ఇచి్చన ˘ ఉత్తర్వుల్లో తెలిపింది. -
రెస్టారెంట్‌కు వెళ్లిన గీతకు షాకిచ్చిన వెయిటర్.. ఏకంగా..
How To Secure Digital Payment Transactions Safe Expert Suggestions: ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వడానికి గీత (పేరు మార్చడమైనది) తన స్నేహితులతో రెస్టారెంట్‌కి వెళ్లింది. ఆర్డర్ ఇచ్చినవన్నీ టేబుల్ మీద అందంగా అమర్చారు అక్కడి వెయిటర్లు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడి పదార్థాలను ఆస్వాదించారు. ఇక చివర్లో వెయిటర్ బిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అది చూసిన గీత తన బ్యాగ్‌లో నుంచి క్రెడిట్ కార్డు తీసి, బిల్ ఉన్న బుక్‌లో పెట్టి వెయిటర్ని పిలిచి, పిన్ నెంబర్ కూడా చెప్పి, స్వైప్ చేసి తీసుకురమ్మంది. వెయిటర్ బిల్ పే చేసి, ఆమె కార్డును ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. పది రోజులు గడిచాయి. తన క్రెడిట్ కార్డు నుంచి అరవై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. షాక్ అయ్యింది గీత. తను ఎక్కడ ట్రాన్సాక్షన్స్ చేసిందో కూడా అర్థం కాలేదు. వేరే రాష్ట్రంలో తను షాపింగ్ చేసినట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే షాపింగ్ ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పారు. మోసం జరిగిందనుకుంటే వెంటనే కార్డు బ్లాక్ చేసుకోమని, మరో కార్డుకు అప్లై చేయమని సూచించారు. క్రెడిట్ కార్డు తన వద్దే ఉంటే అసలు మోసం ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు గీతకు. ∙∙ నగదును మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ మార్కెట్లోకి వచ్చేశాం. లావాదేవీలన్నీ చాలావరకు డిజిటల్ మార్గంలోనే జరుగుతున్నాయి. ఫలితంగా మోసగాళ్లు డిజిటల్ నుంచే పుట్టుకు వస్తున్నారు. ఏ విధంగా మన వద్ద ఉన్న మొత్తాన్ని రాబట్టాలో రకరకాల మార్గాల ద్వారా వ్యూహాలను పన్నుతున్నారు. గీతకు మోసం ఎక్కడ జరిగిందంటే.. రెస్టారెంట్ లో వెయిటర్‌కు బిల్ పే చేయమని కార్డు, పిన్ నెంబర్ ఇచ్చేసింది. దీంతో ఆ వెయిటర్ రెస్టారెంట్ స్వైప్ మిషన్ కన్నా ముందు అరచేతిలో పట్టేంత ఉన్న తన మరో మిషన్‌లో స్వైప్ చేశాడు. దీంతో కార్డులో ఉన్న చిప్ ద్వారా ఆ డేటా అతని మిషన్‌లోకి చేరింది. అటు తర్వాత రెస్టారెంట్ బిల్ పే చేసి, తిరిగి ఆ కార్డును ఆమెకు ఇచ్చేశాడు. ఆ వెయిటర్ అలా డేటా సేకరించడానికి మోసగాళ్లు అతనితో ముందుగానే ‘డీల్’ కుదుర్చుకున్నారు. దీంతో గీత కార్డు వివరాలన్నీ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. పది రోజుల తర్వాత గీత కార్డు బిల్ మొత్తం కట్టేశాక, క్రెడిట్ బ్యాలన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని గ్రహించిన మోసగాళ్లు అంత మొత్తాన్ని ఆమె కార్డు ద్వారా దొంగిలించేశారు. ∙∙ కార్డ్ స్కిమ్, కాపీ, క్లోన్... డేటా ద్వారా కొత్త కార్డులను తయారు చేసే ముఠాలు తయారవుతున్నాయి. ఎక్కువగా రొమేనియన్స్ చేసే ఈ మోసాలు ఇప్పుడు ఇతరులూ చేస్తున్నారు. డార్క్ వెబ్‌లో స్కిమ్మర్, బ్లాక్ కార్డ్ మేకర్స్ కూడా లభించడం, అచ్చం క్రెడిట్/ డెబిట్ కార్డులను పోలి ఉన్నవి తయారుచే సుకోవడం కూడా మోసం చేయడానికి రాచమార్గం. కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టాలంటే... ► మీ కార్డుల వివరాలకు ఎట్టి పరిస్థితులో మీరే రక్షకులు. ► కార్డు ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు మీ దృష్టి మరల్చకూడదు ► స్వైప్ మిషన్ ద్వారా మీ కార్డు నుంచి డెబిట్ చేశాక, ఎంత మొత్తం డెబిట్ చేశారో రిటైలర్ ను అడగండి. ► కొత్త కార్డులు వచ్చిన వెంటనే, ఆ కార్డుపైన సంతకం చేయాల్సిన చోట తప్పనిసరిగా సంతకం చేయండి. ► బిల్లు చెల్లించి, రశీదు తీసుకున్నాక ఒకసారి ఆన్లైన్ స్టేట్మెంట్లో సరిచూసుకోవాలి. ► కార్డు లావాదేవీల ద్వారా పొందిన రశీదులను, మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తపరచుకోవడాన్ని విస్మరించకూడదు. ► మీ కార్డులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. నగదు, మనీ పర్సుల్లానే జాగ్రత్త పరుచుకోవాలి. ► కార్డు మీద పిన్ నెంబర్ రాయకూడదు. అలాగే పిన్ నెంబర్ ఎవరికీ చెప్పకూడదు. ► ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నప్పుడు మీరు ఉపయోగించే సిస్టమ్ యాంటీవైరస్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉన్నదేనా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ► ఇంటర్నెట్ ద్వారా నమ్మకమైన సైట్స్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు మాత్రమే చేయండి. అందుకు భద్రతా నియమాలు పాటించండి. ► ఎక్స్పైరీ డేట్ అయిపోయాక వాటి స్థానంలోకి రీప్లేస్మెంట్ కార్డ్స్ వస్తాయి. ఇలాంటప్పుడు పాత కార్డులను అలాగే పడేయకుండా వాటిలో ఉన్న మాగ్నెటిక్ చిప్‌ను తొలగించాలి. అలాగే ఉపయోగంలో లేని కార్డులను బ్లాక్ చేయాలి. ► లావాదేవీలు జరిపిన తర్వాత పిన్నెంబర్ను మార్చుకోవడం మంచిది. రివార్డ్ పాయింట్స్ రిడెమ్షన్ గురించి అయినా, కార్డు సమాచారం గురించైనా వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తులకు సివివి/ఓటీపీ/క్యూ ఆర్ కోడ్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. బ్యాంకుకు సంబంధించిన ఏ వ్యక్తులు కూడా ఈ గోప్యతా వివరాలను అడగరు. కాబట్టి, గోప్యతా వివరాల పట్ల జాగ్రత్త అవసరం. కార్డు ద్వారా చేసే పేమెంట్ (పిఒఎస్) కార్డు స్కిమ్మింగ్ (మీ వివరాలను కార్డు నుంచి రాబట్టే పరికరం) ఎక్కువగా రిటెయిల్ ఔట్లెట్స్, బార్లు, రెస్టారెంట్లు, పార్కింగ్ టికెట్ మెషిన్స్, పెట్రోల్ స్టేషన్లలో జరిగే అవకాశాలు ఎక్కువ. ► కార్డు ద్వారా నగదు బదిలీ చేసే సమయంలో మీ దృష్టి మరల్చకూడదు ► స్వైప్ చేసేటప్పుడు మీ కార్డు మీకు కనిపించాలనే విషయం స్పష్టంగా చెప్పండి. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా మోసాలు ఎలా జరుగుతాయంటే..? ► మోసగాళ్ల దగ్గర స్టోర్ కార్డ్ రీడర్ మిషన్, దొంగ కార్డు మిషన్ రెండూ ఉంటాయి. ∙మీరు కార్డు ఇవ్వగానే కార్డు స్కిమ్మర్ చేసి, డేటా దొంగిలిస్తారు ∙ఎటిఎమ్ మిషన్లలో అయితే.. కీ బోర్డ్ ప్లేస్‌లో మోసగాళ్లు మరో కీ బోర్డ్‌ను ఇన్స్టాల్ చేస్తారు. ∙స్వైపింగ్ మిషన్‌కు సూక్ష్మమైన కెమెరాను సెట్ చేస్తారు. ఎటిఎమ్‌లలో కార్డును ఉపయోగిస్తుంటే.. ► కార్డును ఉపయోగిస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారి నుంచి జాగ్రత్త. ► మీ పిన్ నెంబర్ మీ నగదుకు కవచం అనే విషయం మర్చిపోవద్దు ► కార్డు పనిచేయనప్పుడు, మిషన్‌లో ఉండిపోయినప్పుడు వెంటనే బ్యాంక్‌కు తెలియజేయాలి ► ట్యాంపరింగ్ సంకేతాలు ఏమైనా కనిపిస్తే ఎటిఎమ్ కార్డును ఉపయోగించవద్దు. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Most Famous Afghanistan Refugee: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే!.. పాపం మరోసారి -
‘అలీబాబా’తో చైనాకు డేటా
న్యూఢిల్లీ: చైనా ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. భారత్‌తో నేరుగా తలపడలేని డ్రాగన్ దేశం హైబ్రిడ్ యుద్ధానికి (మిలటరీయేతర సాధనాలతో ప్రత్యర్థులపై పట్టు బిగించడం) తెరతీసింది. దేశంలో ప్రముఖుల కార్యకలాపాలపై కన్నేసి సైబర్ నేరాలకు పాల్పడుతోంది. భారత్‌లో 72 సర్వర్ల ద్వారా వినియోగదారుల డేటా చైనాకి చేరిపోతోంది. చైనాకు చెందిన టెక్నాలజీ గ్రూప్ అలీబాబా సంస్థ క్లౌడ్ డేటా సర్వర్ల ద్వారా మన దేశంలో ప్రముఖులకు సంబంధించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు చైనాకి చేరిపోతున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌కి వెల్లడించారు. మన దేశ వాణిజ్య రంగంలో అలీబాబా క్లౌడ్ డేటాకి ఆదరణ ఎక్కువగా ఉంది. యూరోపియన్ సర్వర్ల కంటే అలీబాబా తక్కువ ధరకే సర్వర్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఆ సంస్థే భారత్ నుంచి డేటా చౌర్యానికి పాల్పడుతోందని తేలింది. 72 డేటా సర్వర్ల ద్వారా చైనాకి సమాచారం వెళుతున్నట్టు ఇప్పటివరకు గుర్తించామని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పథకం ప్రకారమే చైనా కుట్ర తమ దేశానికి చెందిన టెక్నాలజీ సంస్థల ద్వారా చైనా అధికారులు భారీ ఎత్తున డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ‘ఇదంతా అలీబాబా సంస్థ పథకం ప్రకారమే చేస్తోంది. మొదట ఫ్రీ ట్రయల్ అని కంపెనీలకు ఎర వేస్తుంది. కంపెనీలు అలీబాబా సర్వర్లని సబ్‌స్క్రైబ్ చేసుకోగానే కీలకమైన సమాచారాన్నంతా చైనాలో మారుమూల సర్వర్లకు చేరవేస్తోంది’ అని ఆ వర్గాలు తెలిపాయి. త్వరలో సమగ్ర విచారణ చైనా సైబర్ చౌర్యంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో సమగ్రమైన విచారణ చేపట్టనుంది. డ్రాగన్ దేశం హైబ్రిడ్ యుద్ధానికి తెరలేపిన నేపథ్యంలో చైనాకు చెందిన 200 యాప్‌లను కేంద్రం నిషేధించినట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూనే దేశంలో ప్రముఖుల డేటా చౌర్యానికి పాల్పడుతూ ఉండడంతో కేంద్రం లోతైన దర్యాప్తుని చేపట్టనుంది. -
హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇద్దరు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (యూఎస్‌పీటీఓ) ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్‌కు చెందిన ప్రొఫెసర్ ఆరోగ్యస్వామి జోసెఫ్ పాల్‌రాజ్, సుమితా మిత్రాలకు చోటు దక్కింది. అత్యంత వేగంగా డేటాను ట్రాన్స్మిట్ చేయడంతో పాటు స్వీకరించేలా వైర్లెస్ టెక్నాలజీని రూపొందించినందుకు పాల్‌రాజ్ ఈ ఘనత సాధించారు. నానో కాంపోజిట్ డెంటల్ మెటీరియల్ అభివృద్ధికి కృషి చేసినందుకు సుమితా మిత్రాకు ఈ గౌరవం లభించింది. మే 3న వాషింగ్టన్లో ఈ అవార్డును పాల్‌రాజ్, సుమితాలకు అందిస్తారు. -
ఫేస్‌బుక్‌పై కేసు నమోదు
డబ్లిన్ : సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు ఐర్లాండ్ అధికారులు వెల్లడించారు. ఆస్ట్రియాకు చెందిన విద్యార్థి మాక్స్ స్క్రేమ్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హైకోర్టులో దర్యాప్తు చేస్తున్న డాటా ప్రొటెక్షన్ అధికారులు తెలిపారు. ఐర్లాండ్ ఫేస్బుక్ డిపార్ట్మెంట్ తాను పోస్ట్ చేసిన డాటా, వ్యక్తిగత వివరాలను అమెరికా నిఘా విభాగానికి ట్రాన్స్ఫర్ చేస్తోందని మాక్స్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 4,500 కంపెనీల డాటాను అమెరికాకు అందుబాటులో ఉండేలా యూరోపియన్ కోర్టు తీర్పు ఇవ్వడం ఈ కేసుకు మరింత ఊతమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈయూ కోర్టు తీర్పు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంతో పాటు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడానికి దారితీస్తుందని యూరోపియన్ యూనియన్‌కు చెందిన దేశాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో అప్పుడే తొందరపడి ఓ నిర్ణయం తీసుకోవద్దని న్యాయమూర్తి జస్టిస్ గెరార్డ్ హోగన్ సూచించారు. ఫేస్బుక్ యూరోపియన్ ప్రధాన కార్యాలయం డబ్లిన్‌లో ఉండటంతో ఐర్లాండ్ నిఘా వర్గాలు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు వీలు కల్పించినట్లయింది. -
తిప్పుసుల్తాన్
నెట్‌ఇంట్లో ఇదివరకు రెండే ఇళ్లు... ఒకటి పుట్టిల్లు. ఇంకొటి మెట్టినిల్లు... ఇప్పుడు మూడో ఇల్లు కూడా వచ్చేసింది. అదే నెట్టిల్లు...నెట్ ప్రపంచంలో నేలకు కొరత లేదు. రియల్ బూమ్ల భూదందాలుండవు. ఇక్కడంతా వర్చువల్! నెట్ ప్రపంచం దుర్యోధనుడి మయసభ లాంటిది. కాలు జారనూవచ్చు. కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతాలు చూడనూవచ్చు. మనం మంచినే తీసుకుందాం. మంచిగా పంచుకుందాం. నెట్టింట్లో మంచిని నిజం ఇంట్లోకి వైఫై సాయంతో బ్లూటూత్ బాటలోనో డేటా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఏమంటారు? ‘‘లేదా రొయ్యకు బారెడు మీసము’’ అని వెక్కిరిస్తే వెక్కిరించవచ్చు గాక...! ‘‘మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె’’ అని వ్యంగ్యం వొలికిస్తే వొలికించవచ్చు గాక..!! ‘‘మీసాలోడురోయ్’’ అని వెటకారం పలికిస్తే పలికించవచ్చుగాక!! ‘‘నీ పోతు గడ్డం... ఛీఛీఛీ నాకడ్డం’’ అని ఆరుద్ర లాంటి వారిని భార్య విమర్శిస్తే విమర్శించవచ్చుగాక!! ఎవరెన్ని అన్నా మీసాల బినే వేరు. గడ్డాల ఘనతే వేరు! అందుకే జర్మనీలోని హోఫెనర్ బియర్డ్ క్లబ్ 1990 నుంచి ప్రపంచ గడ్డం పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 3, 4న గడ్డం పోటీలు జరిగాయి. జడ్జీలు మాత్రం అందరూ ఆడవారేనట! ఇందులో మూడు కేటగిరీలు - మీసం విభాగం, సగం మీసం సగం గడ్డం విభాగం, పూర్తి గడ్డం విభాగం. ‘‘గంధం చెక్కల వీరప్పన్ చచ్చిపోయాడు కానీ... బతికుంటే ట్రోఫీ మనదే’’ అని బాధపడకండి. పెద్ద మనసు చేసుకుని దీన్లో విజేతలను ‘‘మీసాలా గోపాలా రారా’’ అంటూ వెల్కం చేయండి. మీసాలూ, గడ్డాలూ ‘తిప్పు సుల్తాన్’లకు స్వాగతం చెప్పండి.<http://www.buzzfeed.com/lauragallant/the-hairiest-event-of-2015-so-far#.fu9MMMpGOO> పెళ్లిళ్ల పేరయ్య ః ఫేస్బుక్! అమెరికాలో ఆర్కన్సాస్‌కు చెందిన షుల్లర్ బెన్సన్ ఆరేళ్ల క్రితం అక్టోబర్ నెలలో సెల్ఫోన్లో ఫేస్బుక్ చూద్దామని యాప్‌ను క్లిక్ చేశాడు. ఫేస్బుక్ ఓపెనైంది. కానీ తెరుచుకున్నది సెలెస్టీ అనే అమ్మాయి అకౌంట్. లాగౌట్ చేద్దామంటే లాగౌట్ బటన్ కనిపించలేదు. అటు 1600 కి.మీ. దూరంలోని కొలరాడోలో ఉన్న సెలెస్టీ ‘ఎవరయ్యా నువ్వు. నా అకౌంట్‌ని ఆపరేట్ చేస్తున్నావు’’ అని వాయించేసింది. అటూ ఇటూ కాస్త కోపం, కావలసినంత కన్ఫ్యూజన్... కొన్ని గంటల పెనుగులాట తరువాత సమస్య సాల్వ్ అయింది. సారీలు, నెవర్మైండ్లు, థాంక్యూలు, మెన్షన్ నాట్లు పూర్తయ్యాక సెలెస్టీ షుల్లర్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ‘‘అనగా అనగనగా అమ్మాయుందిరా.. అనుకోకుండా నా ఫ్రెండయ్యిందిరా’’ అని పాడుకున్నాడు షుల్లర్. ‘‘మిర్చీ మిర్చీ మిర్చీ మిర్చిలాంటి కుర్రాడే’’ అనుకుంది సెలెస్టీ. 2013లో ఇద్దరూ ఫేస్బుక్ నుంచి ఫేస్ టు ఫేస్ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత ఆమె కొలరాడో నుంచి ఆర్కాన్సాస్కి వచ్చి షుల్లర్ రూమ్‌లోనే ఉండడం మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్ 21న షుల్లర్, సెలెస్టీలు ఒక ఇంట్లో ఉండేవాళ్ల నుంచి ఒకింటి వాళ్ల స్థాయికి ఎదిగారు. ఫేస్బుక్ పోస్టుల రూపంలో షుల్లర్ తన ప్రేమ కథను ఇమ్గుర్.కామ్‌లో రాశాడు. 4.70 లక్షల మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ఓ పెద్ద భవనం చిన్న చీకటి గదిలో మార్క్ జుకర్‌బర్గ్ అనే పెళ్లిళ్ల పేరయ్య తన సిస్టమ్ ఎర్రర్ ఒక పెళ్లి చేసేసిందని సంతృప్తిగా నిట్టూర్చాడు. అమెరికాలో అవుతున్న పెళ్లిళ్లలో 17 శాతం ఫేస్బుక్ వల్లే అవుతున్నాయని కథనం!! http://imgur.com/gallery/HK6Fo బుల్ డాగ్ ‘భౌభౌ’, భల్లూకం ‘బేర్ బేర్ ఓ బుల్లి బుల్ డాగ్ తన ‘భౌ భౌ’తో ఒకటి కాదు, ఏకంగా రెండు ఎలుగుబంట్లను బేర్మనిపించింది. తంతే తొమ్మిది కిలోల బరువుండదు ఆ బుల్లి కుక్క. భల్లూకం ఒక్కొక్కటి నలభై అయిదు కిలోలు. కానీ కుక్క కొంచెమైనా దాని అరుపు ఘనం. ఒక ఇంట్లోకి భల్లూకాలు చొరబడ్డాయి. ఇంట్లో వాళ్లు భయంతో పరుగులు తీశారు. కానీ బుల్డాగ్ భౌభౌమంది. ఆ అరుపులకు భల్లూకాలు బెదిరి పారిపోయాయి. విధి నిర్వహణ చేసిన తృప్తితో తోకాడించుకుంటూ బుల్డాగ్ మళ్లీ తన మూలకి చేరుకుంది. ఈ సంఘటన లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. బుల్లికుక్క యజమాని ‘చాలా ధైర్యంగా’ తలుపులన్నీ బిగించుకుని, కిటికీ సందులోనుంచి బుల్లి కుక్క సాహసాన్ని విడియో తీసి, దాన్ని అప్లోడ్ చేశాడు. కుందేళ్లు తోడేళ్లను తరిమికొట్టిన చోట విజయనగర సామ్రాజం ఏర్పడింది. సికాకులం చిట్టడవుల్లో చిలకలు కత్తులు దులపరించిన చోట విప్లవాలు పుట్టాయట... ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అని అడవుల్లోకి పిలిచాయట. మరి ఈ బూల్డాగ్ భల్లూకాలను బేర్మనిపించిన చోట ఏమవుతుందో చూడాలి. www.sakshipost.com/index.php/ news/international/64231-tiny-bulldog- manages- to-chase-2-bears-out-of-her-garden.html ఈ మ్యూజిక్ ఏ వాయిద్యాన్నీ హింసించలేదు ఈ సినిమాలో ఏ జంతువునూ హింసించలేదు అంటూ డిస్ క్లెయిమర్లు ఇవ్వడం చూశాం. కానీ ఈ మ్యూజిక్ వీడియోలో ఏ వాయిద్యాన్నీ హింసించలేదు అన్న ప్రకటన ఎక్కడైనా చూశారా? అలాగైతే ఈ వీడియో మీరు తప్పక చూడాల్సిందే. ప్లాస్టిక్ గ్లాసులు, గాజు గ్లాసులు, స్పైట్ సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, సిల్వర్ కాగితం, ఖాళీ వాటర్ బబుల్, టేబుల్, నాలుగు కర్ర ముక్కలు, ఒక గాజు గ్లాసు నుంచి ఇంకో గాజు గ్లాసులోకి ఐసు ముక్కలు వేయడం... ఇవి చాలు ఏఆర్ రహమాన్ రోజాలో కట్టిన ‘‘పరువం వానగా...’’ పాటను మళ్లీ పుట్టించడానికి. 18 నుండి 20 ఏళ్లలోపు ఉన్న కుర్రకారు క్రియేటివిటీ ఇది అవడానికి ఓ కూల్ డ్రింక్ యాడ్ కావచ్చు. కానీ తమ కంపోజిషన్‌ను ఏ ఆర్ రహమాన్ అంతటి వాడికి అంకితం ఇచ్చేంత కుర్ర పొగరును తప్పనిసరిగా చూసి తీరాల్సిందే. ఇప్పటికే 10.08 లక్షల మంది చూశారు. మీరూ చూడండి. <https://www.youtube.com/watch?v=_X0IBya0SQk> ఇచ్చుటలో ఉన్న హాయి! ఓ ముసలావిడ బస్సెక్కుతుంది. ఆమె ఎక్కడ సీటడుగుతుందోనని ఓ యువతి చెవులకు ఇయర్ ఫోన్లు బిగించుకుని ఎటో చూస్తూ చేయని రిక్వెస్టుకు చెప్పని ‘నో’ని ముఖంపై ఫిక్స్ చేసుకుని కూర్చుంటుంది. ఆమె పక్కనున్న కుర్రాడు లేచి నిలబడి చిరునవ్వుతో పెద్దావిడకి సీటిస్తాడు. అప్పుడు చూస్తుంది ఆ యువతి... ఆ కుర్రాడికి ఒక కాలే ఉంటుంది. ఆ యువతి ముఖంలో పశ్చాత్తాపం మేఘంలా ముసురుకుంటుంది. ఆమె లేచి ఆ కుర్రాడికి సీటిస్తుంది. జాయ్ ఆఫ్ గివింగ్ ఉద్యమంలో భాగంగా తయారైన ఈ యాత్ ఉద్యమం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ ఫీవర్ పుట్టిస్తోంది.https://www.kulzy.com/work/92966/joy-of-giving-week/film/bus/#_=_