సుమితా మిత్రా, ఆరోగ్యస్వామి జోసెఫ్ పాల్‌రాజ్
వాషింగ్టన్: అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (యూఎస్‌పీటీఓ) ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్‌కు చెందిన ప్రొఫెసర్ ఆరోగ్యస్వామి జోసెఫ్ పాల్‌రాజ్, సుమితా మిత్రాలకు చోటు దక్కింది. అత్యంత వేగంగా డేటాను ట్రాన్స్‌మిట్ చేయడంతో పాటు స్వీకరించేలా వైర్‌లెస్ టెక్నాలజీని రూపొందించినందుకు పాల్‌రాజ్ ఈ ఘనత సాధించారు. నానో కాంపోజిట్ డెంటల్ మెటీరియల్ అభివృద్ధికి కృషి చేసినందుకు సుమితా మిత్రాకు ఈ గౌరవం లభించింది. మే 3న వాషింగ్టన్‌లో ఈ అవార్డును పాల్‌రాజ్, సుమితాలకు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment