ఫేస్బుక్పై కేసు నమోదు
డబ్లిన్ : సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్బుక్పై దర్యాప్తు ప్రారంభించినట్లు ఐర్లాండ్ అధికారులు వెల్లడించారు. ఆస్ట్రియాకు చెందిన విద్యార్థి మాక్స్ స్క్రేమ్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హైకోర్టులో దర్యాప్తు చేస్తున్న డాటా ప్రొటెక్షన్ అధికారులు తెలిపారు. ఐర్లాండ్ ఫేస్బుక్ డిపార్ట్మెంట్ తాను పోస్ట్ చేసిన డాటా, వ్యక్తిగత వివరాలను అమెరికా నిఘా విభాగానికి ట్రాన్స్ఫర్ చేస్తోందని మాక్స్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
4,500 కంపెనీల డాటాను అమెరికాకు అందుబాటులో ఉండేలా యూరోపియన్ కోర్టు తీర్పు ఇవ్వడం ఈ కేసుకు మరింత ఊతమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈయూ కోర్టు తీర్పు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంతో పాటు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడానికి దారితీస్తుందని యూరోపియన్ యూనియన్కు చెందిన దేశాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో అప్పుడే తొందరపడి ఓ నిర్ణయం తీసుకోవద్దని న్యాయమూర్తి జస్టిస్ గెరార్డ్ హోగన్ సూచించారు. ఫేస్బుక్ యూరోపియన్ ప్రధాన కార్యాలయం డబ్లిన్లో ఉండటంతో ఐర్లాండ్ నిఘా వర్గాలు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు వీలు కల్పించినట్లయింది.