ఓపెన్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలొన్‌మస్క్ హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.
కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఓపెన్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఎలొన్‌మస్క్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘ఓపెన్‌ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మాకంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తాం. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. యాపిల్‌కు తన సొంత ఏఐను తయారుచేసుకునే సత్తాఉందని భావిస్తున్నాం. అయినా, ఓపెన్‌ఏఐ యాపిల్ భద్రతను, సమాచార గోప్యతను కాపాడుతుందని ఎలా భరోసా ఇవ్వగలరు’ అని పోస్ట్‌చేశారు.
కన్సల్టింగ్ సంస్థ క్రియేటివ్ స్ట్రాటజీస్ సీఈఓ బెన్ బజారిన్ మాట్లాడుతూ..‘ప్రైవేట్ క్లౌడ్‌లో కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలియజేయడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ క్లౌడ్‌లో ఫైర్‌వాల్ ద్వారా వినియోగదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతున్నపుడు యాపిల్‌కు కూడా సరైన సమాచారం ఉండదు’ అన్నారు.
ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్‌పిచాయ్
2015లో ఎలొన్‌మస్క్, సామ్‌ఆల్ట్‌మాన్ కలిసి ఓపెన్‌ఏఐను స్థాపించారు. లాభాపేక్ష లేకుండా మానవాళి ప్రయోజనం కోసం ఏఐను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు మస్క్ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని కంపెనీ నుంచి బయటకు వచ్చి సీఈవో సామ్‌ఆల్ట్‌మాన్‌పై మస్క్ దావా వేశారు. ఓపెన్‌ఏఐకి పోటీగా, చాట్‌జీపీటీ చాట్‌బాట్‌కు ప్రత్యామ్నాయంగా మస్క్ ఎక్స్‌ఏఐను రూపొందించారు.
If Apple integrates OpenAI at the OS level, then Apple devices will be banned at my companies. That is an unacceptable security violation.
— Elon Musk (@elonmusk) June 10, 2024
Comments
Please login to add a commentAdd a comment