
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీలో మంగళవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మాజీ మంత్రి నారా లోకేశ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కరచాలనం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అసెంబ్లీలో లాబీలో వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడటంతో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
ఆర్కేతో కరచాలనం చేసిన లోకేశ్.. ఆయనకు అభినందనలు తెలిపారు. తనను అభినందించిన లోకేశ్‌కు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ ముఖాముఖి మొదటిసారి పలకరించుకోవడం అందరిలోనూ ఆసక్తి రేపింది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్కే 5 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment