రైతు పక్షపాతి ఎవరో...రైతు ద్రోహి ఎవరో ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. రైతాంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ పాయింట్ వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు ఉచిత విద్యుత్ అందజేసి వైఎస్సార్ వ్యవసాయానికి ప్రాణం పోశారని... రైతు సంక్షేమం కోసం ఆయన అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకుని సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతారన్నారు.