సాక్షి, విజయవాడ: పచ్చమీడియా రోజురోజుకు దిగజారిపోతుందని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్ రాజధానిలో పర్యటించారని విమర్శించారు. రెండు వేల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీడీటీ అధికారులు స్పష్టంగా ప్రెస్ నోట్‌లో చెప్పారని తెలిపారు. శ్రీనివాస్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అడ్డంగా దొరికిపోయారన్నారు. సీబీడీటీ ప్రాథమిక విచారణ లోనే రెండు వేల కోట్ల అక్రమ వ్యవహారం జరిగితే ఇక పూర్తిస్థాయిలో విచారణ జరిగితే చంద్రబాబుకు సంబంధించిన వేల కోట్ల అక్రమ సంపాదన బయట పడుతుందన్నారు. ('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా')
‘తన మాజీ పీఎస్ ఇంటిపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు. లోకేష్ బినామీ రాకేష్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదు.తన కొడుకు కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే మాజీ మంత్రి పుల్లారావు ఎందుకు నోరు విప్పడం లేదు. ఇప్పటికీ పవన్‌కల్యాణ్, సీపీఐ రామకృష్ణ, నారాయణలు ఎందుకు మాట్లాడటం లేదు. టీడీపీ నేతలు, పచ్చమీడియా ఎందుకు గొంతులు చించుకుంటుందని’ ఆర్కే ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment