
సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి బాగోతంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2 వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు చంద్రబాబు, లోకేష్ పాల్పడ్డారని మండిపడ్డారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలన్నారు. ఈ అవినీతి బాగోతంపై పవన్‌కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కర్నూలు ఓట్ల నమోదులో అవకతవకలు చోటు చేసుకున్నాయని.. వీటిపై మరోసారి పరిశీలించి సరైన పద్దతిలో సవరణలు చేయాలని హఫీజ్ ఖాన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment