సాక్షి, విజయవాడ : నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబెట్టి గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేశారని వైస్సార్‌సీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన తనయుడు మహాత్మా గాంధీ స్పూర్తికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ముందు గాంధీ, అంబ్కేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని గతంలో తాము చెప్పామని, కానీ ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. అన్యాయాలకు, అక్రమాలను పాల్పడే చంద్రబాబుకు గాంధీ విగ్రహం పెట్టాలంటే భయమని ఏద్దేవా చేశారు.
గతంలో ఏర్పాటు చేస్తామన్న125అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏమైందని ప్రశ్నించారు. గాంధీని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటే టీడీపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి గౌరవం ఇవ్వడంలేదని విమర్శించారు. ఏపీలో తప్పా అన్ని చోట్ల అసెంబ్లీల్లో గాంధీ విగ్రహాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ఫోటోలకి పాలాభిషేకం చేసే స్పీకర్ కోడల శివప్రసాద్ గాంధీ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 23మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు. ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్‌లోనైనా తీర్మానం చేసి వెంటనే గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment