సాక్షి, అమరావతి: 2024 ఎన్నికల్లోనూ తాను తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన సోమవారం మంగళగిరి కార్యకర్తలతో ఉండవల్లిలో మాట్లాడారు. త్వరలోనే తాను మంగళగిరిలో పర్యటించనున్నట్లు చెప్పారు. అయితే ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దొని, ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుని మనకి పార్టీ అండగా ఉందని అన్నారు. రాష్ట్ర మంత్రి హోదాలో మంగళగిరి బరిలో నిలిచిన లోకేష్... వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో ఘోర పరాజయం పాలైన తెలిసిందే.
నారా లోకేష్ ఓవైపు ఓటమిపై తాను బాధపడటం లేదంటూనే మరోవైపు...మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడే అందరూ రాంగ్ సెలక్షన్ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా అందరూ అదే అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. కాగా ఓటమి అనంతరం నియోజకవర్గ సీనియర్ నేతలెవరూ చంద్రబాబు, లోకేష్‌లను కలవలేదు. అయితే రెండు రోజుల నుంచి చోటా నాయకులు, చంద్రబాబు, చినబాబును కలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment