
సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో తనపై పోటీకి దిగిన ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌బాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదో ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. మంగళగిరిలో తన చేతిలో ఓడిపోతారనే భయంతోనే లోకేశ్‌తో చంద్రబాబు రాజీనామా చేయించలేదా? లేక లోకేశే రాజీనామాకు నిరాకరించారా? అని ఆయన ప్రశ్నించారు. ‘నువ్వే మీ నాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటావు. నాన్న నేను రాజీనామా చేయను. నాకు ఎమ్మెల్సీ పదవి ఉండాల్సిందే. పొరపాటునో.. గ్రహపాటునో నేను ఆర్కే చేతిలో ఓడిపోతే.. నాకీ ఎమ్మెల్సీ పదవైనా ఉంటుందని చెప్పేసి.. నువ్వు రాజీనామా చేసి ఉండవు’ అని ఆర్కే లోకేశ్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులో పేర్కొన్నారు.ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రామసుబ్బారెడ్డిలతో ఎమ్మెల్సీ పదవులకు చంద్రబాబు రాజీనామా చేయించారని, కానీ, మీతో ఎందుకు రాజీనామా చేయించలేదని లోకేశ్‌ను నిలదీశారు.
‘నాపై ఎలాగూ ఓడిపోతావనే భయంతోనే నువ్వు రాజీనామా చేయలేదా? ఎమ్మెల్యేగా ఓడిపోతే కనీసం ఎమ్మెల్సీగానన్న మూడున్నరేళ్లు కొనసాగవచ్చని మీరు అనుకుంటున్నారా? అది అవాస్తవమైతే తక్షణమే మీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నేను కోరుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment